News

సీతారాముల కల్యాణానికి గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలు

207views

విజయనగరం జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో ఈ నెల 17న జరగనున్న శ్రీరామనవమి కల్యాణానికి గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలు సిద్ధమయ్యాయి. రామతీర్థం సేవా సంఘం ఆధ్వర్యంలో 2017 నుంచి స్వామి కల్యాణానికి ఈ పవిత్ర తలంబ్రాలను వినియోగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పలువురు శ్రీరామ భక్తులు ప్రత్యేకంగా సేద్యం చేసిన ధాన్యాన్ని పవిత్ర ప్రదేశాల్లో శ్రీరామనామాన్ని జపిస్తూ గోటితో ఒలిచి తలంబ్రాలుగా మార్చారు. అలా సిద్ధం చేసిన కోటి తలంబ్రాలను 108 కళశాలలో నింపి 500 మంది భక్తులచే ఈ నెల 15న రామతీర్థం పురవీధుల్లో మేళ తాళాలు, భజనలు, కోలాటాల నడుమ ఊరేగింపుగా వెళ్లి స్వామికి సమర్పిస్తామని రామతీర్థం సేవా సంఘం కార్యదర్శి విజయ్‌కుమార్‌ తెలిపారు.