News

News

అమెరికాలో జాతి వివక్ష చావలేదా?

వివేక్ రామస్వామి.. అమెరికాలో స్థిరపడిన భారతీయుడు. పోనీ భారతీయ సంతతికి చెందినవాడు. రిపబ్లికన్ పార్టీ నాయకుడు. ఈసారి అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేద్దామనుకుని, పరిస్థితి అనుకూలించక మొన్న జనవరిలో ప్రచారం నిలిపివేశారు. నిజం చెప్పాలంటే అమెరికాలో ఇప్పటికీ చాలావరకు ప్రభావం చూపుతున్న...
News

అన్నవరం సత్యదేవుడి సన్నిధిలో పండిత సదస్యం

కాకినాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవుడి సన్నిధి వేదఘోషతో పులకించింది. రాష్ట్రం నలుమూలల నుంచి వేదాలలో నిష్ణాతులైన పండితులు తమ వేదవిద్యను స్వామివారి పాదాలచెంత ఉంచి పునీతులయ్యారు. స్వామివారి దివ్యకల్యాణోత్సవాలలో భాగంగా పండిత సదస్యం అత్యంత ఘనంగా జరిగింది. నవవధూవరులైన...
News

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ

వేసవి సెలవుల నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. భవానీదీక్షలు, దసరా నవరాత్రుల తరహాలో రోజుకు సుమారు 50 వేల మంది భక్తులు వస్తున్నారు. మండే ఎండలను లెక్క చేయకుండా సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. దీంతో రూ.25 లక్షల దాకా టిక్కెట్ల ఆదాయం జమ అవుతోంది. ఎక్కువ శాతం మంది తమ సొంత వాహనాలతో వస్తుండడం వల్ల పార్కింగ్‌ సమస్య ఉత్పన్నమవుతోంది. కనకదుర్గానగర్‌లో అభివృద్ధి పనుల కారణంగా పార్కింగ్‌ స్థలం కొరత ఏర్పడింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్టు ఈవో కేఎస్‌ రామారావు తెలిపారు....
News

మే 25 నుంచి దుర్గావాహిని శౌర్య ప్రశిక్షణ వర్గ

బాల, లలిత, అన్నపూర్ణ, వారాహి, పరాశక్తి, భువనేశ్వరి, చండి ఈ అన్నీ కనకదుర్గ నామాంతరాలు. దుర్గాభవానిగా లోకాన్ని కాపాడుతుంది. బాల లలితాన్నపూర్ణగా సున్నిత తత్వమున్నా, సందర్భానుసారం సునిశితంగా వ్యవహరిస్తుంది. వాహిని అంటే నదీ ప్రవాహధార. మరో కోణంలో సేనా విశేషం. ఖ్యాతి అని కూడా అర్థం.ఇప్పుడు అవగతమవుతోంది కదూ! దుర్గావాహిని ఒక అజేయ శక్తిశాలిని. అబల అనే పదాన్ని నిషేధించి, 'సబల'ను ఆవిష్కరించింది దుర్గావాహిని మహిళాశక్తి. నేటి యువతుల్లో ధార్మిక నిష్టతోపాటు ఆత్మస్థైర్యాన్ని పెంచి పరిపోషించేందుకు వారంరోజుల విస్తృతస్థాయి 'శౌర్య ప్రశిక్షణ'ను ఈ మే నెలాఖరు వరకు నిర్వహిస్తోంది. శ్రీకాకుళంలోని గాయత్రీ కళాశాల ప్రాంగణ వేదికగా మార్గదర్శనం అందిస్తోంది. యుద్ధవిద్యలో మరింత నేర్పు కలిగించి, సాంస్కృతిక వికాసాన్ని అంతటా విస్తరించి, సమైక్య కుటుంబ భావనను ఫలప్రదం చేస్తోంది. సామాజిక సేవాకార్యక్రమాల పరంపరతో, సంకల్ప బలంతో పురోగమిస్తున్న వ్యవస్థ....
News

భారతీయ సంస్కృతిలో జీవన విలువలు

భారతీయ సంస్కృతిలో జీవన విలువలున్నాయని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారతీయ కార్యకారిణి సభ్యులు డాక్టర్‌ వారణాసి రామ్‌మాధవ్‌ అన్నారు.కాకినాడలోని స్థానిక సూర్యకళా మందిరంలో న్యూ ఢిల్లీకి చెందిన కొచ్చర్లకోట రామరాజు ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రముఖ సంగీత వాగ్గేయ కారుడు కొచ్చర్లకోట రామరాజు 148వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ సంగీత వాగ్గేయ కారుడు రామరాజు తన కళను ధన సంపాదన కోసం కాకుండా కీర్తి సంపాదించేందుకు ఉపయోగించడం ఎంతో అభినందనీయమన్నారు. ప్రతి వ్యక్తి ధార్మిక భావంతో ఉన్నప్పుడే కళలు విశ్వవ్యాప్త మవుతాయన్నారు. క్రీ.స్తుశకం 6వ శతాబ్దం వరకు ఎటువంటి కుల వివాదాలు లేవని, విదేశీయుల దండయాత్రలతో కులో న్మాధం ప్రజ్వరిల్లిందని ఈ విషయాన్ని పాశ్చాత్య దేశాలు సైతం అంగీకరిస్తున్నాయన్నారు.సంగీతం మనుకు ప్రశాంతత ఇస్తుం దన్నారు. ఉగ్రరూపంలో...
ArticlesNews

అ‘ద్వితీయం’ కూర్మావతారం

( మే 23 - కూర్మ జయంతి ) శ్రీమహావిష్ణువు ధరించిన ప్రసిద్ధ అవతారాలలోని అ'ద్వితీయం' కూర్మావతారం. దేవదానవులు క్షీరసాగరంలో అమృత మథనానికి యత్నించినప్పుడు కవ్వమైన మంధర గిరి సాగరజలాల పాలుకాకుండా కాపాడేందుకు హరి కూర్మరూపుడిగా అవతరించాడు. దానవుల చేతిలో పరాజితులైన...
News

నేటి నుంచి అన్నమయ్య 616వ జయంతి ఉత్సవాలు

తాళ్లపాక అన్నమాచార్యులవారి 616వ జయంతి ఉత్సవాలు ఈ రోజు (మే 23) నుండి 29వ తేదీ వ‌ర‌కు అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద, తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో జ‌రుగ‌నున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం-టీటీడీ ఒక...
ArticlesNews

విశ్వశాంతి స్వరూపుడు గౌతమబుద్ధుడు

( మే 23 - బుద్ధ పూర్ణిమ ) మానవ అస్తిత్వం, ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన విశిష్ట స్పృహతో ఉన్న కొంతమంది వ్యక్తులు చరిత్రలోని విభిన్న మలుపుల్లో మొత్తం మానవాళికి సంబంధిత కాలాలకు సంబంధించిన కొత్త మార్గాన్ని చూపుతూ వచ్చారు. అటువంటి...
News

ముస్లింల ఓబీసీ హోదా రద్దు

పశ్చిమ బెంగాల్‌లో ముస్లిం ఉప కులాలకు ఇచ్చిన ఓబీసీ హోదాను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2010 తరువాత ప్రభుత్వ ఉద్యోగాలు, సర్వీసుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు 77 ముస్లిం ఉప కులాలను ఓబీసీలుగా గుర్తిస్తూ తీసుకొచ్చిన ఉత్తర్వులు...
News

మోహిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన చిన్న వెంకన్న

ఏలూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఐదవ రోజు బుధవారం చిన వెంకన్న స్వామి మోహిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయ అధికారులు స్వామివారిని...
1 1,207 1,208 1,209 1,210 1,211 2,480
Page 1209 of 2480