వినాయకుడి రూపంలో అంతరార్థం
హిందూ సంప్రదాయంలో తొలి పూజ ఆ గణపతికే సొంతం. సమస్త విఘ్నాలను తొలగించి తమకు ముక్తిని ప్రసాదించేది ఆయనే అని భక్తులు విశ్వసిస్తారు. కష్టాలను తొలగించి, జ్ఞానాన్ని ప్రసాదించేవాడని నమ్ముతారు. అయితే.. వినాయకుడి రూపం వెనుకున్న పరమార్థాలు మీకు తెలుసా? ఏనుగు తల: ఇది జ్ఞానం, అవగాహనకు ప్రతీక. జీవితంలో పరిపూర్ణతను సాధించడానికి తప్పనిసరిగా కలిగి ఉండవలసిన విచక్షణా బుద్ధిని సూచిస్తుందని పండితులు అంటున్నారు. వినాయకుడి రెండు దంతాల్లో ఒకటి విరిగిపోయి ఉంటుంది. మరి దీని అర్థం ఏమంటే.. త్యాగం, పట్టుదలకు గుర్తుగా చెబుతున్నారు. పురాణాల ప్రకారం.. వ్యాసుడు మహాభారతాన్ని రాయడానికి గణేశుడు తన దంతాన్ని విరిచి ఇచ్చాడట. వినాయకుడి చేతిలో ఎప్పుడూ మోదకాలు ఉంటాయి. అవి అంతరంగంలోని మాధుర్యాన్ని, స్వీయ-సాక్షాత్కార ఆనందాన్ని సూచిస్తాయట. మోదకం తినడం వల్ల జ్ఞానం, సంపదలు లభిస్తాయని భావిస్తారు. గణపతి వాహనం...











