
విశ్వ గురుకులం నిర్వాహకులు రామ్ మారం మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను, ఉపాధ్యాయుల అంకితభావాన్ని, తల్లిదండ్రుల సహకారాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. రామాయణంలోని ఆదర్శాలు, విలువలను భావితరాలకు అందించడంలో ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.
రామాయణ పుస్తక రచనలో సహకారం అందించిన మామిళ్ల లోకనాథం ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలువైన సూచనలు అందిస్తూ ఉపాధ్యాయుల కృషిని, విద్యార్థుల పురోగతిని, నిర్వాహకుల సేవలను అభినందించారు. పాఠశాల కార్యదర్శి శ్వేత వెలగలేటి, పద్మిని, సిద్ధార్థ్ పుట్రేవు తదితరులు విద్యార్థుల ప్రదర్శనలను తిలకించి వారిని అభినందించారు.
విశ్వ గురుకులంలో రామాయణ తరగతులను వంశీ శ్రీవాత్సవ భద్రి రాజు, రేవతి పుట్రేవు, సుష్మిత మక్కపాటి, శ్రీరేఖ పంచవటి, భాగ్యలక్ష్మి గుమ్మడి, వంశీ బొల్ల, అనూష నిమ్మగడ్డ, సుష్మ కొల్లూరి తదితర ఉపాధ్యాయులు నిర్వహిస్తున్నారు.
అమెరికాలో నివసిస్తున్నప్పటికీ తమ పిల్లలకు వాల్మీకి రామాయణాన్ని సంపూర్ణంగా బోధిస్తున్న తానా విశ్వ గురుకులం సేవల పట్ల తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. గురువులకు, నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలను భావితరాలకు పరిచయం చేయడంలో విశ్వ గురుకులం చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.
రామాయణంలోని ఆదర్శాలను విద్యార్థుల జీవితాల్లో భాగం చేస్తూ, భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించేందుకు తానా విశ్వ గురుకులం చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.





