
37views
హిందూ సమాజం ఆర్థికంగా బలోపేతం కావాలంటే హిందువులు పరస్పరం వ్యాపార లావాదేవీలు జరపాలని నితేష్ రాణే పిలుపునిచ్చారు. హిందూ పండుగలు, మతపరమైన కార్యక్రమాల్లో హిందూ వ్యాపారులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. రంజాన్ సందర్భంగా ముస్లిం వ్యాపారులకు లభించే అవకాశాలను ప్రస్తావిస్తూ, హిందూ పండుగల సమయంలోనూ హిందూ వ్యాపారులను ప్రోత్సహించాలని ఆయన వాదించారు.
నాసిక్ సింహస్థ కుంభమేళా 2026లో ప్రారంభం కానున్న నేపథ్యంలో, అక్కడ ఇతర మతాలకు చెందినవారు దుకాణాలు ఏర్పాటు చేయడాన్ని అనుమతించకూడదని రాణే గతంలోనూ డిమాండ్ చేశారు. హిందూ ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రాధాన్యమిచ్చే ఈ మహోత్సవంలో హిందూ వ్యాపారులకే అవకాశాలు కల్పించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ డిమాండ్ మతపరమైన గుర్తింపు ఆధారంగా వ్యాపార అవకాశాలను పరిమితం చేయాలనే చర్చకు దారితీసింది.





