News

‘హిందూ’’ అనేది ఓ స్వభావం.. మతం ఆధారంగా అర్ధం చేసుకోలేం : లండన్ లో డా. మోహన్ భాగవత్

22views
న్యూఢిల్లీ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్య శతాబ్ది సందర్భంగా ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ ప్రస్తుతం లండన్ లో పర్యటిస్తున్నారు.. హిందూ స్వయంసేవక్ సంఘ్ (HSS UK) 60వ వార్షికోత్సవ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రశ్నోత్తరాల సమావేశంలో హిందూ’, ‘రాష్ట్రం’ మరియు ‘కర్మభూమి పట్ల విధేయత’ వంటి మౌలిక అంశాలపై లోతైన విషయాలను పంచుకున్నారు.
ప్రశ్న : కాల పరీక్షకు నిలిచిన ఆర్ఎస్ఎస్ ముఖ్యమైన ఒక అంశాన్ని తెలియజేయండి?
జవాబు : ‘‘శుద్ధ సాత్విక ప్రేమ’’… ఇదే ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలకు మూలాధారం. ఆత్మీయత, స్వచ్ఛమైన సాత్విక ప్రేమ కలిగి వుండటం అనేది హిందువుల సహజ స్వభావం. హిందువులు ప్రకృతిని కేవలం ఆరాధించడమే కాకుండా, దానిని ప్రేమిస్తారు కూడా; ఇదే హిందువుల సంప్రదాయ స్వభావం.
ప్రశ్న : ప్రస్తుతం ఎటు చూసినా అశాంతే. ఈ కాలంలో ప్రపంచానికి హిందూ నాగరికత అందించే అంశమేమిటి?
జవాబు : హిందూ భావనలన్నీ ఒకే మూలతత్త్వంపై ఆధారపడి ఉంటాయి. వాస్తవానికి ఉనికి ఒక్కటే అయినప్పటికీ, అది వైవిధ్యభరితంగా కనిపిస్తుంది. ఈ వైవిధ్యాలు సహజమైనవి, కాబట్టి మనం వాటిని గౌరవించి స్వీకరించాలి. ఆ ఒక్కటే అనేక రూపాలుగా మారింది, అందుకే ఆ అనేక రూపాలు గౌరవించబడుతున్నాయి.
3. ప్రశ్న : హిందూ రాష్ట్ర, హిందుత్వ అనే పదాలు అత్యధికంగా చర్చించుకుంటున్నారు. కానీ తక్కువగా అర్థమవుతాయి. మేము మా కార్యాలయాల్లో, పొరుగువారితో, మా పిల్లలతో మేము వీటిపై మాట్లాడాలనుకుంటే మీరు మాకు చెప్పే నిర్వచనం ఏమిటి?
జవాబు : బతుకు.. బతికించు, ఇతరులు కూడా బతికేలా చేయు. హిందూ అనే పదాన్ని మనం మతాచారాల ఆధారంగా అర్థం చేసుకోలేం. హిందూ అనేది ఒక స్వభావం. దానిని మతం ఆధారంగానో, జీవన విధానంతోనో అర్థం చేసుకోలేం. కానీ.. అన్ని వైవిధ్యాలూ ఒకే దగ్గరికి దారితీస్తాయి కాబట్టి, వాటిని అంగీకరించి, గౌరవించాలని విశ్వసించే ఒక దృక్పథంగా అర్థం చేసుకోవాలి.మనం హిందూ మతం ఒక మతం కాదని అంటాము. హిందూ మతాలు ఉండవచ్చు. హిందూ మతాలు ఇతర మతాలన్నీ కూడా నిజమేనని చెబుతాయి.
నాస్తికుల నుండి బహుదేవతారాధకుల వరకు – భరతవర్షం నుండి అన్ని రకాల ఆలోచనలు వెలువడ్డాయి.
దేశం అనేది రాష్ట్ర అనే పదానికి అనువాదం కాదు. దేశం అంటే జాతి-రాజ్యం. భాష, పాలన విధానం లేదా మతం వంటి కొన్ని సారూప్యతల కారణంగా ప్రజలు ఒకచోట చేరతారు. మరియు కలిసి ఉండటానికి వారికి కొన్ని నియమాలు ఉంటాయి. వారు తమ ఉమ్మడి లక్ష్యాల కోసం కృషి చేస్తారు. మానవులు ఒంటరిగా మనుగడ సాగించలేరు.’రాష్ట్ర’ అనేది అటువంటిది కాదు. ‘రాష్ట్ర’కు ముందుగా ఒక లక్ష్యం ఉంటుంది. హిందూ రాష్ట్ర లక్ష్యం ఏమిటి? వైవిధ్యం సహజమైనదని, ఐక్యతే సత్యమని ప్రపంచానికి తెలియజేయడమే ఆ లక్ష్యం. దీనివల్ల ప్రపంచానికి మేలు జరుగుతుంది.