News

గుడి స్తంబాలకు గోడలు కట్టి మసీదు మార్చిన అమీనాబాద్ శివాలయం కథ

6views

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, పల్నాడు జిల్లా గుంటూరు నుంచి ఫిరంగిపురం వెళ్లే దారిలో ఉండే అమీనాబాద్ గ్రామం కథ. ఆ ఊర్లో సుమారు 950 ముస్లిం కుటుంబాలు ఉంటే, హిందువులు కేవలం 150 ఇళ్లు మాత్రమే ఉన్నారు. జనాభా ఎక్కువ, మా మాటే నెగ్గాలి, మేం చేసిందే చట్టం అన్నట్లుగా ఉంది అక్కడి వ్యవహారం.

అసలు చరిత్ర ఏమిటంటే… రెడ్డి రాజుల కాలంలో అదొక అద్భుతమైన, ఎంతో శక్తివంతమైన శివాలయం. ఆ తర్వాత కాలంలో ముస్లిం పాలకుల దండయాత్రల్లో అది ధ్వంసమైంది. ప్రస్తుతం ఆ ప్రాచీన ఆలయం అధికారికంగా పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. చట్టప్రకారం పురావస్తు శాఖ పరిధిలోని చారిత్రక కట్టడాల రూపురేఖలను ఎవరూ మార్చకూడదు, ఎలాంటి మార్పులు చేయకూడదు. మరి అక్కడ ఏం జరిగింది?

ఆ శివాలయం స్తంభాలను గోడలతో మూసేశారు. వాటికి రంగులు వేసి, ‘మల్కా మహల్’ అని పేరు పెట్టేసుకున్నారు. బక్రీద్, రంజాన్ సమయాల్లో అక్కడే ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా మన ప్రభుత్వం గానీ, పురావస్తు శాఖ అధికారులు గానీ ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? ఈ దేశంలో చట్టం, న్యాయం అందరికీ ఒకేలా ఉన్నాయా లేక మనుషులను బట్టి మారిపోతాయా?

నాకో విషయం అర్థం కాదు… ఖురాన్ ప్రకారం చూసుకున్నా ఇతరుల ప్రార్థనా స్థలాలను, దేవాలయాలను ఇలా ఆక్రమించి మసీదుల్లా మారిస్తే మీ దైవం ఒప్పుకుంటాడా? కాఫీర్లవి, సత్యతిరస్కారులవి అని చెప్పేవాటిని ఇలా ఆక్రమించుకోవడం ఏ ధర్మం కిందకు వస్తుంది?

ఇలాంటి నిజాలను ఆధారాలతో సహా బయటపెడితే చాలు… కామెంట్ సెక్షన్లలోకి కొందరు ‘శాంతి దూతలు’ బయలుదేరి వస్తారు. “నువ్వు మతాల మధ్య చిచ్చు పెడుతున్నావ్, ప్రజలను రెచ్చగొడుతున్నావ్” అంటూ నీతులు చెబుతారు. అలాంటి వాళ్లకి నేను సూటిగా ఒక్కటే చెప్పదలుచుకున్నా… ఎక్కడ విద్వేషం ఉందో, ఎవరు సమాజాన్ని రెచ్చగొడుతున్నారో మీ మీ సిద్ధాంతాలు సరిగ్గా చదివితే అందరికీ స్పష్టంగా తెలుస్తుంది. మళ్ళీ ఇలాంటి వాళ్లే ప్రతి వారం ప్రార్థనలకు వెళ్తారు. అక్కడికి వెళ్లి నేర్చుకుని వస్తున్నది ఇదేనా? కామెంట్లలో వీళ్లు వాడే బూతులు చూస్తుంటే అసహ్యం వేస్తుంది.

చేతనైతే ఇలాంటి అన్యాయాలను, చట్టవిరుద్ధమైన ఆక్రమణలను వ్యతిరేకించండి. అంతే తప్ప, మా వాళ్లు ఏం చేసినా సమర్థిస్తాం, ప్రశ్నించిన వారిని బూతులు తిడతాం అంటే ఇక్కడ ఎవరూ భయపడేవాళ్లు లేరు. మన చరిత్రను, మన ఆలయాలను కాపాడుకోవడం కోసం నిలదీస్తూనే ఉంటాం!