
5views
పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. తిరుపతిలోని వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ కార్యాలయంలో ‘మలినమైన రసాయనాలు వద్దు – మట్టితో చేసిన గణపతిని పూజిద్దాం’ ప్రచారపత్రికను మంత్రి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధ్యాత్మిక చింతన, భక్తి భావంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రసాయనాలు లేని వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని మంత్రి కోరారు. తిరుపతి లాంటి ఆధ్యాత్మిక కేంద్రంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అందరూ మెచ్చే రీతిలో గణపతి ఉత్సవాలు, నిమజ్జన మహోత్సవాలు జరగాలని తెలిపారు.





