
ఆగస్టు 29న మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో జరగనున్న ఆర్ఎస్ఎస్ (RSs) సర్సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్న న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీపై అమెరికన్ గాయని మేరీ మిల్బెన్ తీవ్రంగా స్పందించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ పట్ల తమకున్న వ్యతిరేకత కారణంగానే మేయర్ మరియు ఇతర విమర్శకులు ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆమె ఆరోపించారు.
ఆ ర్యాలీకి తాను మద్దతివ్వనని మామ్ దానీ చెప్పారని, ఓ ప్రైవేట్ కార్యక్రమాన్ని రద్దు చేసే చట్టపరమైన అధికారం ఆయనకు వుందా? అని మేరీ మిల్బెన్ ప్రశ్నించారు. అలాగే ఆరెస్సెస్ స్వభావం అందర్నీ కలుపుకొనిపోయే స్వభావం అని పేర్కొన్నారు.
మామ్దానీ, ఈ సోషలిస్ట్ పిచ్చివాళ్లందరూ మోహన్ భాగవత్ పాల్గొనే మాడిసన్ స్క్వేర్ గార్డెన్ (MSG) కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నారు, ఎందుకంటే వారు ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీని వ్యతిరేకిస్తున్నారు. ఇది చాలా స్పష్టం.” అంటూ ఎక్స్ మాధ్యమంగా పోస్ట్ చేశారు. ప్రధాని మోదీ అందరికీ నాయకుడని, అయితే మమ్దానీ ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని మేరీ మిల్బెన్ పేర్కొన్నారు. మమ్దానీ వేదికపైకి వచ్చి తన అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి స్వేచ్ఛ ఉంది, కానీ కార్యక్రమం మాత్రం కొనసాగుతుంది. నేను ప్రధాని మోదీని గౌరవిస్తాను. అని ఆమె తెలిపారు.
’’ఈ మూర్ఖులు సోషలిజం సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నందున, వారికి పెట్టుబడిదారీ విధానం అర్థం కాదు. మెడిసన్ స్క్వేర్ గార్డెన్ యాజమాన్యం సోషలిస్ట్ ప్రేలాపనలకు లొంగదు. అది పెట్టుబడిదారీ విధానానికి మాత్రమే జవాబుదారీగా ఉంటుంది. అందువల్లనే ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మమ్దానీకి ఇంకా ఆయన సోషలిస్టుల బృందానికి నాదొక సలహా. మీరు పెట్టుబడిదారులుగా మారండి, డబ్బు సేకరించండి, MSGని అద్దెకు తీసుకోండి. ఆ తర్వాత మోదీకి వ్యతిరేకంగా నువ్వే సొంత ర్యాలీని నిర్వహించు. చివరగా, ఒక విషయం చెప్పాలి. నాకు ర్యాలీ శీర్షిక బాగా నచ్చింది. ‘ఏకత్వం’- మనమంతా ఒకే కుటుంబం. భారతదేశంలో మత స్వేచ్ఛపై ఈ ర్యాలీలో అర్థవంతమైన సంభాషణ జరుగుతుందని నేను ఆశిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
మోదీ దేశవ్యాప్తంగా మత స్వేచ్ఛను ప్రోత్సహించి, ప్రజలకు భద్రతా భావాన్ని కల్పించిన నాయకుడు. ఈ ఆర్ఎస్ఎస్ (RSS) ర్యాలీ ఆ సందేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తుందని, అలాగే మందానీ వ్యాఖ్యల ప్రభావానికి లోనుకాకుండా ఉంటుందని తాను ఆశిస్తున్నానని అన్నారు.
ప్రఖ్యాత అమెరికన్ గాయని మేరీ మిల్బెన్ భారతీయ సమాజంలో ఎంతో ఆదరణ పొందారు. 2023లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించినప్పుడు ఆమె భారతదేశ జాతీయ గీతం ‘జన గణ మన’ను ఆలపించారు. అంతేకాకుండా, ఆమె ‘ఓం జై జగదీశ హరే’ గీతాన్ని ఆలపిస్తున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది. మిల్బెన్ భారతీయ సంస్కృతిని ఎంతో గౌరవిస్తారు.
ఇంతకీ న్యూయార్క్ మేయర్ ఏమన్నారంటే..
“నేను ఈ ర్యాలీకి మద్దతు ఇవ్వను, కానీ ఒక ప్రైవేట్ కార్యక్రమాన్ని రద్దు చేసే చట్టపరమైన అధికారం నగర యంత్రాంగానికి ఉందో లేదో నాకు తెలియదు. ఈ నగర చరిత్రలో నేనే మొదటి భారతీయ-అమెరికన్ మేయర్‌ని, అలాగే నా తల్లి కుటుంబం ఇప్పటికీ భారతదేశంలోనే నివసిస్తోంది.. నా కుటుంబం నాలో నాటిన దృక్పథం ఏమిటంటే.. అది భిన్నత్వంతో కూడిన సమాజం మరియు ప్రతి పౌరుడికీ సమాన హక్కులు ఉంటాయని విశ్వసించే లౌకిక గణతంత్ర రాజ్యం. అని భారత్ గురించి చెప్పారు.’’ అని పేర్కొన్నారు.





