
ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో ఉన్న బంకె బిహారీ ఆలయంలో భక్తులు ఇస్తున్న విరాళాలు దారి మళ్లడంపై సుప్రీంకోర్టు మండిపడింది. విరాళాల చోరీకి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరాదని పాలకమండలికి స్పష్టం చేసింది. ‘భక్తులిచ్చే ప్రతి పైసా హుండీకే చేరాలి. ఆన్ లైన్ ద్వారా సమకూరే నిధులు ఆలయ కోశాగారానికే వెళ్లాలి’ అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ బాగ్చీ, జస్టిస్ వి.మోహన ధర్మా సనం పేర్కొంది. హుండీల వద్ద అడ్డంగా నిలబడుతున్న పూజారులు(సేవాయత్ భండారీలు) భక్తుల నుంచి వచ్చే విరాళాలను తమ సంచీలలో నింపుకొంటున్న దృశ్యాల చిత్రాలను ఆలయ పాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఉన్నత స్థాయి కమిటీ మంగళ వారం విచారణ సందర్భంగా ధర్మాసనం ముందుంచింది. ఆన్ లైన్లో విరాళాల చెల్లింపులకు వెసులుబాటు కల్పించే క్యూఆర్ కోడ్లు ధ్వంసమైనట్లుగా ఓ వీడి
యోలో నమోదైంది. ఆలయం ఆదాయాన్ని సొంత ఆస్తుల కొనుగోలుకు ధర్మకర్తలు మళ్లిస్తున్నారని పూజారుల తరపు న్యాయవాది ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోని ట్రస్ట్ పర్యవేక్షణలోకి బంకే బిహారీ ఆలయాన్ని తీసుకువచ్చేలా రూపొందించిన ఆర్డినెన్సును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ సంద ర్భంగా ఈ విషయాలు ధర్మాసనం ముందుకు వచ్చాయి. గత విచారణ సమయంలో ఈ ఆర్డినెన్స్ అమలును నిలిపివేస్తూ 12 మంది సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని ధర్మాసనం నియమించింది.




