వికసిత్ భారత్‌కు దిశ, దశ చూపేది సంస్కృతమేనని కేంద్ర నాయ్యశాఖ మంత్రి అర్జున్ మేఘవాలే తెలిపారు. ఎన్‌ఎస్‌యూలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఉత్కర్ష మహోత్సవం–2026 కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. కేంద్రమంత్రి మాట్లాడుతూ సంస్కృతంలోని జ్ఞానం అర్థం చేసుకుని, సామాజిక విలువలను కాపాడాలని కోరారు. ప్రపంచంలోని శ్లోకాలు, హితవాక్యాలు రచించడం సంస్కృత గౌరవాన్ని తెలియజేస్తుందని చెప్పారు. సంస్కృతంలోని శాస్త్రాలు, ఇతర ఆధునిక విషయాలతో పరిశోధనలు ముమ్మరం చేస్తే మరింత ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని సూచించారు. అనంతరం విశ్వవిద్యాలయంలో మహా పరీక్షలో ఉత్తీర్ణత సాధించినటువంటి అద్వైత వేదాంత విద్యార్థి వరదరాజన్‌కు వేదాంత విధ్వన్మణి పురస్కారం ప్రదానం చేశారు. చక్కటి విద్వాంసుడిని తయారు చేసిన అద్వైత వేదాంత విభాగ ఆచార్యులు డాక్టర్ శ్రీహరి శివరాం దాయగుడేను శాస్త్ర విధ్వన్మణి బిరుదుతో సత్కరించారు. అలాగే అవధాని కేవీఎస్ఎస్, ఎస్వీయూ రిటైర్డ్ ప్రొఫెసర్ ప్రతాప్‌ను అవార్డులతో సత్కరించారు. అనంతరం వర్సిటీ ప్రచురించిన 25 పుస్తకాలను ఆవిష్కరించారు. ఎన్ఎస్యూ వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి, లాల్ బహదూర్‌శాస్త్రి సంస్కృత వర్సిటీ వీసీ మురళీ మనోహర్ పాఠక్, రిజిస్ట్రార్ వెంకటనారాయణరావు, డీన్ రజనీకాంత్ శుక్లా, కో–ఆర్డినేటర్ గణపతిభట్, ఆచార్యులు సత్యనారాయణ, శ్రీవాత్సవ, దక్షణమూర్తి శర్మ పాల్గొన్నారు
87views
You Might Also Like
ఆలయ ప్రదక్షిణ : భక్తి, వినయం, అంతర్ముఖతకు ఆధ్యాత్మిక మార్గం
హిందూ ధర్మంలో ప్రతి ఆచారానికీ ఒక అంతరార్థం ఉంటుంది. ఆలయానికి వెళ్లడం, గర్భాలయ దర్శనం చేసుకోవడం, తీర్థప్రసాదాలు స్వీకరించడం, నమస్కరించడం వంటి ప్రతి సంప్రదాయమూ మనిషిని బాహ్య...
‘అద్వైతసిద్ధి’కి తెనాలి పరీక్ష
తెనాలి పరీక్ష". నేడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశ మైంది. ఇంతకీ ఏమిటీ పరీక్ష.. అంత కఠినంగా ఉంటుందా.. దేశం మొత్తమ్మీద ఒక్క తెనాలిలోనే ఎందుకు నిర్వహిస్తారు? ప్రధాని...
దయ చూపండంటున్నా.. మహిళకు షరియా శిక్ష 100 కొరడా దెబ్బలు
11
ఇండోనేషియాలోని వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళకు అక్కడి అధికారులు దారుణమైన శిక్ష విధించారు. అచే ప్రావిన్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. బహిరంగంగా శిక్ష అమలు చేస్తున్న సమయంలో...
ఇరాన్లో హిజాబ్ నిబంధనలకు సవాల్.. స్కార్ఫ్ లేకుండానే 10K రేసులో పాల్గొన్న మహిళలు
8
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జరిగిన 10 కిలోమీటర్ల రన్నింగ్ రేసులో పలువురు మహిళలు తలపై హిజాబ్ లేదా స్కార్ఫ్ ధరించకుండా పాల్గొన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా...
శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోండి.. విద్యార్థులకు అజిత్ డోభాల్ పిలుపు
19
జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలని భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ డోభాల్ విద్యార్థులకు సూచించారు. ఇందుకోసం శ్రీరాముడి జీవితాన్ని ఆదర్శంగా...
పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
8
పాకిస్థాన్, తాలిబాన్ల మధ్య విభేదాలు మళ్లీ తీవ్ర రూపాన్ని దాల్చాయి. ఇటీవల పాకిస్థాన్‌లో జరిగిన ఒక భారీ తీవ్రవాద దాడి తర్వాత, ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్‌కు...





