వికసిత్ భారత్‌కు దిశ, దశ చూపేది సంస్కృతమేనని కేంద్ర నాయ్యశాఖ మంత్రి అర్జున్ మేఘవాలే తెలిపారు. ఎన్‌ఎస్‌యూలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఉత్కర్ష మహోత్సవం–2026 కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. కేంద్రమంత్రి మాట్లాడుతూ సంస్కృతంలోని జ్ఞానం అర్థం చేసుకుని, సామాజిక విలువలను కాపాడాలని కోరారు. ప్రపంచంలోని శ్లోకాలు, హితవాక్యాలు రచించడం సంస్కృత గౌరవాన్ని తెలియజేస్తుందని చెప్పారు. సంస్కృతంలోని శాస్త్రాలు, ఇతర ఆధునిక విషయాలతో పరిశోధనలు ముమ్మరం చేస్తే మరింత ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని సూచించారు. అనంతరం విశ్వవిద్యాలయంలో మహా పరీక్షలో ఉత్తీర్ణత సాధించినటువంటి అద్వైత వేదాంత విద్యార్థి వరదరాజన్‌కు వేదాంత విధ్వన్మణి పురస్కారం ప్రదానం చేశారు. చక్కటి విద్వాంసుడిని తయారు చేసిన అద్వైత వేదాంత విభాగ ఆచార్యులు డాక్టర్ శ్రీహరి శివరాం దాయగుడేను శాస్త్ర విధ్వన్మణి బిరుదుతో సత్కరించారు. అలాగే అవధాని కేవీఎస్ఎస్, ఎస్వీయూ రిటైర్డ్ ప్రొఫెసర్ ప్రతాప్‌ను అవార్డులతో సత్కరించారు. అనంతరం వర్సిటీ ప్రచురించిన 25 పుస్తకాలను ఆవిష్కరించారు. ఎన్ఎస్యూ వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి, లాల్ బహదూర్‌శాస్త్రి సంస్కృత వర్సిటీ వీసీ మురళీ మనోహర్ పాఠక్, రిజిస్ట్రార్ వెంకటనారాయణరావు, డీన్ రజనీకాంత్ శుక్లా, కో–ఆర్డినేటర్ గణపతిభట్, ఆచార్యులు సత్యనారాయణ, శ్రీవాత్సవ, దక్షణమూర్తి శర్మ పాల్గొన్నారు
116views
You Might Also Like
రైతుల విషయంలో సుప్రీం ఇచ్చిన తీర్పును స్వాగతించిన బీకేఎస్
23
న్యూఢిల్లీ : ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో పెరుగుతున్న వాయు కాలుష్యానికి సంబంధించి, పంట వ్యర్థాలను కాల్చడంపై మరియు రైతుల విషయంలో సుప్రీంకోర్టు (జస్టిస్ సూర్య కాంత్ మరియు జస్టిస్...
మత మార్పిడి నిరోధక చట్టాన్ని నీరుగార్చొద్దు : VHP
28
బెంగళూరు : బలవంతం, మోసం, ఒత్తిడి మరియు ప్రలోభాల ద్వారా జరిగే మతమార్పిడులను నిరోధించడానికి 'కర్ణాటక మత స్వేచ్ఛ హక్కుల పరిరక్షణ చట్టం, 2022' అవసరమని పేర్కొంటూ,...
ఖురాన్ లాకెట్‌పై వివాదం.. కరీనాకు అండగా నిలిచిన హిందూ ఉత్సవ సమితి!
43
బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ దీపావళి సందర్భంగా ధరించిన పురాతన పచ్చల లాకెట్ వివాదానికి కేంద్రంగా మారింది. పవిత్ర ఖురాన్‌లోని ‘ఆయత్-ఉల్-కుర్సీ’ వాక్యాలు చెక్కిన ఆభరణాన్ని...
తిరుమల వేంకటేశుడికి రూపమిచ్చిన చిత్రకారుడు శ్రీనివాసన్ కన్నుమూత
30
ఇంటింటా పూజలందుకుంటున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి చిత్రానికి ప్రాణం పోసిన ప్రఖ్యాత చిత్రకారుడు ఎస్.ఎం. శ్రీనివాసన్ (86) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తమిళనాడులోని తూత్తుకుడి...
ఛఠ్ పూజకు ముందు యమునా నదిలో చనిపోయిన చేపలు..
43
దేశ రాజధాని ఢిల్లీలో ఛఠ్ పూజ వేడుకలకు సన్నాహాలు జరుగుతున్న వేళ యమునా నదిలో చనిపోయిన చేపలు కలకలం రేపుతున్నాయి. సోనియా విహార్ సమీపంలోని యమునా నదిలో...
భారతదేశంలో విజ్ఞానం, ఆధ్యాత్మిక సంప్రదాయాలు కలిసే అభివృద్ధి చెందాయి
32
మైసూరులోని చాముండి కొండల పాదాల వద్ద ఉన్న జయచామరాజ వడియార్ ఉన్నత విద్యా కేంద్రంలో ఏర్పాటు చేసిన భారతదేశపు తొలి ఎస్ఈడీ ప్లానిటోరియం, ప్రపంచంలోనే తొలి టిల్టెడ్...





