News

విశాఖపట్నం గుడిలోవలో ప్రారంభమైన RSS అఖిల భారతీయ సమన్వయ బైఠక్

62views

విశాఖపట్నం, ఆగస్టు 19, 2026: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అఖిల భారత సమన్వయ బైఠక్ విశాఖపట్నం సమీపంలోని గుడిలోవలో గల ‘విజ్ఞాన విహార్’ పాఠశాలలో ప్రారంభమైంది. పూజ్యనీయ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ జీ, గౌరవనీయ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే జీలు భారత మాత చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఈ సమావేశాన్ని ప్రారంభించారు. ఈ బైఠక్ ఆగస్టు 21 సాయంత్రం వరకు కొనసాగనుంది.

వార్షిక అఖిల భారత సమన్వయ సమావేశంలో సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ జీ, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే జీలతో పాటు సహ సర్ కార్యవాహులు, ఇతర కేంద్ర కార్యవర్గ ప్రముఖులు పాల్గొంటున్నారు.

సంఘ్ ప్రేరణతో పనిచేస్తున్న భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS), విశ్వహిందూ పరిషత్ (VHP), భారతీయ జనతా పార్టీ (BJP), అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP), భారతీయ కిసాన్ సంఘ్, రాష్ట్ర సేవికా సమితి వంటి 32 వివిధ సంస్థల జాతీయ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అఖిల భారత సంఘటన మంత్రులు, ఎంపిక చేసిన కీలక కార్యకర్తలు ఈ సమన్వయ బైఠక్‌కు హాజరవుతున్నారు. వివిధ సంస్థల నుంచి 49 మంది మహిళలతో సహా 253 మంది కీలక కార్యకర్తలు, అలాగే సంఘ్ కార్యవర్గ ప్రముఖులతో కలిపి మొత్తం 327 మంది ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు.