News

తాలిబాన్ తరహాలో హిందూ డ్రైవర్ హత్య

34views
న్యూఢిల్లీలో అచ్చు తాలిబాన్ల తరహాలో హిందూ క్యాబ్ డ్రైవర్ విజయ్ కుమార్ ను (40) నలుగురు ముస్లింలు ఘోరంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు మద్యం మత్తులో ఉన్నారని, సులభంగా డబ్బు సంపాదించడం కోసం దొంగతనానికి పాల్పడి డ్రైవర్‌పై దాడి చేశారని పేర్కొన్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా, మైనర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నాల్గవ నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఈ ఘటన ఈ నెల 23 న కృష్ణా నగర్‌లోని రోడ్డు నంబర్ 57 సమీపంలో జరిగింది. డ్రైవర్ విజయ్ తన కారులో తీవ్ర గాయాలతో కనిపించాడు. తాలిబన్ల శైలిలో అతని గొంతు కోసి హత్య చేసినట్లు తెలుస్తోంది. వెంటనే ఆయనను డాక్టర్ హెడ్గేవార్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై కృష్ణా నగర్ పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మొదట ఎటువంటి ఆధారాలూ లేని ఈ “బ్లైండ్ మర్డర్” కేసును కృష్ణా నగర్ పోలీస్ స్టేషన్, షాదరా జిల్లా స్పెషల్ స్టాఫ్ బృందాలు సీసీటీవీ ఫుటేజ్, కాల్ డిటైల్ రికార్డ్స్ (CDRs), సాంకేతిక ఆధారాలు మరియు స్థానిక సమాచారాన్ని విశ్లేషించి 24 గంటల్లోనే ఛేదించాయి. అరెస్టు చేసిన నిందితులను అయాన్ (20), సాహిల్ (19)లతో పాటు 17 ఏళ్ల మైనర్‌గా గుర్తించారు. పరారీలో ఉన్న నాల్గో నిందితుడు అమన్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.
హత్య ఎలా జరిగిందంటే
జూలై 23న మద్యం సేవించిన తర్వాత, సులభంగా డబ్బు సంపాదించడానికి ఒక క్యాబ్ డ్రైవర్‌ను దోచుకోవాలని పథకం పన్నారు. ఈ పథకంలో భాగంగానే విజయ్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకున్నారని, అది చివరకు హత్యకు దారితీసిందని పోలీసులు తెలిపారు.
ఈ ముఠాలోని అమన్ ఒక కత్తిని సమకూర్చగా, అయాన్ మొబైల్ ఫోన్ ఉపయోగించి V3S మాల్‌కు రాపిడో క్యాబ్‌ను బుక్ చేశారు. చిత్రా విహార్ రెడ్ లైట్ వద్ద నిందితులు డ్రైవర్‌ను పలుమార్లు కత్తితో పొడిచి, క్యాబ్‌లోనే పరారయ్యారు. ప్రయాణ మార్గంలో బాధితుడి శరీరాన్ని బయట పడేసినట్లు పోలీసులు తెలిపారు.ఆ తర్వాత నిందితులు వ్యాగన్ ఆర్ కారుపై నియంత్రణ కోల్పోయి మరొక వాహనాన్ని ఢీకొట్టారు. ఆ వాహనంలోని వారు తమను తము తరుముతుండటంతో, దొరికిపోతామనే భయంతో ఈస్ట్ ఆజాద్ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో క్యాబ్‌ను వదిలేసి పరారయ్యారు.
ఘటనా స్థలం నుండి హత్యకు ఉపయోగించిన కత్తి, నిందితుల రక్తపు మరకల దుస్తులు, రక్తంతో ఉన్న వ్యాగన్ ఆర్ కారు, మొబైల్ ఫోన్లు మరియు ఇతర కీలక ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అయాన్‌పై గతంలో దోపిడీ, స్నాచింగ్‌లతో సహా నాలుగు నేరపూరిత కేసులు ఉన్నాయని, సాహిల్ పై కూడా ఒక స్నాచింగ్ కేసు నమోదై ఉందని పోలీసులు తెలిపారు.