
574views
జమ్మూ-కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఆదివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం జిల్లాలోని దయాళ్ గామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో ఆదివారం ఉదయం భద్రతా దళాలు ఈ ప్రాంతానికి చేరుకొని గాలింపు చేపట్టాయి. వీరి కదలికల్ని పసిగట్టిన ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ క్రమంలో నలుగురు ఉగ్రవాదులు అక్కడికక్కడే హతమయ్యారు. వారు ఏ ముఠాకు చెందినవారో ఇంకా తెలియాల్సి ఉంది.





