News

సంప్రదాయబద్ధంగా గణేష్ ఉత్సవాలు

31views

శ్రీకాకుళం జిల్లాలో ఈ ఏడాది నిర్వహించనున్న శ్రీ గణేష్ ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని జిల్లా గణేష్ ఉత్సవ సమితి జిల్లా కార్యదర్శి గొద్దు భాస్కరరావు పిలుపునిచ్చారు.

జీటీ రోడ్డులోని జిల్లా గణేష్ ఉత్సవ సమితి కార్యాలయంలో నిర్వహించిన జిల్లా ప్రథమ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సమితి రాష్ట్ర కార్యదర్శి విష్ణుమూర్తి మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని మండలాల్లో గణేష్ ఉత్సవ సమితుల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు. హిందూ సమాజ ఐక్యతకు, సనాతన ధర్మ పరిరక్షణకు గణేష్ ఉత్సవాలు ప్రధాన వేదికలుగా నిలవాలని ఆకాంక్షించారు.

అనంతరం నూతనంగా ఎన్నికైన జిల్లా ఉత్సవ కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం నిర్వహించారు.

నూతన జిల్లా కమిటీ:

– అధ్యక్షుడు – బుర్రా ఆదినారాయణ శాస్త్రి
– జిల్లా ప్రధాన కార్యదర్శి – గొద్దు భాస్కరరావు
– కోశాధికారి – ఇప్పిలి కృష్ణారావు
– కార్యాలయ కార్యదర్శి – ఎస్వీ రమణమూర్తి
– సహాయ కార్యదర్శులు – వి. నాగేశ్వరరావు, డా. భరత్ శేషగిరిరావు, జలుమూరు వెంకటేశ్వరరావు
– ఆధ్యాత్మిక సలహాదారు – ధర్మపురి గౌరీశంకర శాస్త్రి

ఈ సమావేశంలో వీనస్ హరి, వెంకుబాబు, నీలంరాజు తదితరులు పాల్గొన్నారు. రాబోయే శ్రీ గణేష్ ఉత్సవాలను జిల్లావ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు సమితి కార్యాచరణ రూపొందించింది.