
22views
తాలిబన్ పాలకులు అఫ్గానిస్థాన్‌లో మహిళలపై విధించిన కఠిన ఆంక్షలను వెంటనే ఎత్తేయాలని, దేశంలో తీవ్రవాదులను నియంత్రించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. 2027 జూన్ 17 వరకు అఫ్గాన్‌లో ఐరాస ప్రతినిధులు ఉండేందుకు, అక్కడ మానవతా సాయాన్ని అందించేందుకు తీర్మానంలో ఆమోదం తెలిపారు. ‘కఠినమైన డ్రెస్‌కోడ్‌ను పాటించనందుకు 30 మంది మహిళలను తాలిబన్ ప్రభుత్వం ఇటీవల అరెస్టు చేయగా.. అది ఆందోళనలకు దారి తీసింది. దీన్ని అణచివేసే క్రమంలో తాలిబన్ పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందడంతో పాటు పలువురికి గాయాలు అయ్యాయి’ అని ఐరాస పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఐరాస భద్రతా మండలిలో ఈ తీర్మానం ఆమోదించారు.





