ArticlesNews

ఆదర్శగృహిణికి ఆరు రూపాలు

36views

ధర్మశాస్త్రాలలోనూ, పురాణాలలోనూ ఆదర్శ గృహిణి అనే పదం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. తమ జీవితాల్లో ఎదురైన క్లిష్ట పరిస్థితులను, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని, తమ వ్యక్తిత్వంతో పురాణాల్లో ప్రసిద్ధి చెందిన వారు అహల్య, సీత, తారల గురించి గతవారం సంచికలో తెలుసుకున్నాం. ఈ వారం మండోదరి, ద్రౌపది, కుంతిల గురించి తెలుసుకుందాం. ఈ ఆరుగురు స్త్రీవ•ర్తులు భారతీయ సంస్కృతిలో స్త్రీ శక్తికి వివిధ రూపాలు. ఆరు లక్షణాలను వేర్వేరు సందర్భాల్లో తమదైన శైలిలో నిరూపించుకున్నారు.

‌ద్రౌపది:

మహాభారతంలో ద్రౌపది పాత్ర అత్యంత శక్తివంతమైనది. ఆమె కేవలం ఐదుగురు భర్తలకు భార్య మాత్రమే కాదుసామ్రాజ్యపు గౌరవాన్ని కాపాడే మహారాణి. ‘‘కార్యేషు దాసి…’’ అనే శ్లోకంలోని లక్ష ణాలను ద్రౌపది తన జీవితంలో అద్భుతంగా ప్రద ర్శించింది. ముఖ్యంగా పాండవులు అరణ్యఅజ్ఞాత వాసాల్లో ఉన్నప్పుడు ఆమె వ్యవహరించిన తీరు విశిష్టమైనది. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ద్రౌపది వారికి సేవలు చేయడంలో ఏనాడూ వెనుకాడలేదు. రాజకుమారిగా పుట్టినావేలమంది పరిచారికలు ఉన్న వైభవాన్ని చూసినా.. అడవిలో భర్తలకు అవసరమైన పనులను భక్తి శ్రద్ధలతోవినమ్రతతో నిర్వహించేది. సత్యభామ ద్రౌపదిని కలిసి నప్పుడు, ‘నీ భర్తలను ఎలా వశం చేసుకున్నావు?’ అని అడిగితేద్రౌపది నేను అహం కారాన్ని విడిచి వారికి సేవ చేస్తానని సమాధాన మిస్తుంది.

ద్రౌపది గొప్ప మేధావి. రాజనీతిజ్ఞురాలు. ద్రౌపది చాతుర్యంలోని అంతరార్థం ధర్మరాజు జూదంలో తనను తాను ఓడిపోయిన తర్వాతశకుని ప్రేరేపణతో ద్రౌపదిని పణంగా పెట్టాడు. అప్పుడు ద్రౌపది సభలోకి రాకముందే ప్రతీహారి (వార్తా హరుడు) ద్వారా ఒక ప్రశ్న పంపింది. ధర్మరాజు జూదంలో నన్నోడి తన్నోడెనాతన్నోడి నన్నోడెనా (తనను తాను ఓడిపోయి నన్ను ఓడాడాలేక నన్ను ఓడిపోయిన తర్వాత తనను తాను ఓడాడా?’) సభలో భీష్మవిదురద్రోణాచార్యుల వంటి మహామహులు ఉన్నాఆమె వేసిన ఈ ధర్మ సందేహానికి ఎవరూ సూటిగా సమాధానం చెప్పలేకపోయారు. భీష్ముడి ధర్మం అనేది చాలా సూక్ష్మమైనది. ఓడిపోయిన వాడికి అధికారం ఉండదు అనేది నిజమే అయినాభార్యపై భర్తకు ఎప్పుడూ అధికారం ఉంటుందని కొందరు అంటారుఅని నీళ్లు నమిలాడు. కానీద్రౌపది తన పట్టు వదలకుండాతను స్వతంత్రురాలిననితనను పణంగా పెట్టడం అక్రమమని వాదించింది. ద్రౌపది అడిగిన ప్రశ్నలోని న్యాయాన్ని గ్రహించికౌరవులలో ఒకడైన వికర్ణుడు ఆమెకు మద్దతు పలికాడు. ధర్మరాజు తనను తాను ఓడిపోయిన తర్వాత ద్రౌపదిని పణంగా పెట్టడం అధర్మమనిఈ జూదం చెల్లదని అతను ప్రకటించాడు. ఇది ద్రౌపది మేధస్సు సాధించిన తొలి విజయం.

దుశ్శాసనుడు ఆమెను అవమానిస్తున్నాఆమె కుప్పకూలిపోలేదు. తన తర్కంతో ధర్మంతో ధృతరాష్ట్రుడిని సైతం ఆలోచింపజేసింది. చివరకు ఆమె వాదనలోని ధర్మాన్ని గుర్తించిన ధృత రాష్ట్రుడుఆమెను మూడు వరాలు కోరుకోమన్నాడు. మొదటి వరంగా తన భర్త అయిన ధర్మరాజుకు దాస్య విముక్తి కోరింది. రెండో వరంగా మిగిలిన నలుగురు భర్తలకు విముక్తి కోరింది.

మూడో వరం కోరుకోమంటే, ‘‘క్షత్రియ వనితకు రెండు వరాలే చాలునా భర్తలు స్వతంత్రులైతే వారి రాజ్యాలను వారే సంపాదించుకోగలరు’’ అని చెప్పడం ఆమె ఆత్మగౌరవానికి నిదర్శనం. తానోడి నన్నోడి’ అనే వాదన కేవలం ఒక ప్రశ్న మాత్రమే కాదుఅది స్త్రీ అస్తిత్వానికి.హక్కులకు సంబం ధించిన ఒక గొప్ప పోరాటం. ద్రౌపది ఆ సభలో కేవలం బాధితురాలిగా కాకుండాఒక గొప్ప న్యాయ వాదిగామేధావిగా నిలిచింది. అందుకే ఆమెను స్మరించడం వల్ల మనలోని అజ్ఞానం తొలగిబుద్ధి వికాసం కలుగుతుందని అంటారు.

వనవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజు నిరాశలో ఉన్నా లేదా అధిక శాంతాన్ని ప్రదర్శిస్తున్నాఆమె ఒక మంత్రిలా అతనికి క్షత్రియ ధర్మాన్ని గుర్తుచేసేది. సంసారాన్నిరాజ్యాన్ని ఎలా నిర్వహించాలో ఆమె సత్యభామకు వివ రించిన తీరు ఆమెలోని పరిపాలనా దక్షతను (మంత్రి త్వాన్ని) చూపుతుంది. ద్రౌపది అయోనిజ (అగ్ని నుండి పుట్టినది). ఆమె సౌందర్యం సాటిలేనిది. ఆమె తేజస్సును చూసి శత్రువులు సైతం ఆశ్చర్య పోయేవారు. ద్రౌపదికి ఆవేశం ఉన్నప్పటికీఅవసర మైనప్పుడు అపారమైన క్షమను ప్రదర్శించింది. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాతతన ఐదుగురు కుమారులను చంపిన అశ్వత్థామను చంపవద్దనిపుత్రశోకం అంటే ఏమిటో అతని తల్లి (కృపి)కి తెలియ కూడదని ఆమె క్షమించి వదిలేయమంటుంది. ఇది ఆమెలోని భూదేవి వంటి సహనానికి నిదర్శనం.

ఆమె దగ్గర అక్షయపాత్ర’ ఉన్నప్పుడుఅడవికివచ్చే వేలాది మంది మునులకుఅతిథులకుతన భర్తలకు స్వయంగా వడ్డించేది. అందరూ భుజించిన తర్వాతే ఆమె తినేది. ఒక తల్లి తన బిడ్డల ఆకలిని ఎలా తీరుస్తుందోఅలా ఆమె పాండవుల యోగక్షేమాలను చూసుకునేది. భర్తల మనసును ఎరిగివారికి మానసిక ఉల్లాసాన్నిసుఖాన్ని అందించడంలో ఆమె రంభ వలె ప్రియమైనదిగా వ్యవహరించేది. వారి కష్టాలన్నింటినీ తన మాటలతోసాన్నిధ్యంతో మర్చిపోయేలా చేసేది. ద్రౌపది ‘‘వీరనారి’’. అహల్యలో క్షమసీతమ్మలో త్యాగం ప్రధానంగా కనిపిస్తేద్రౌపదిలో ధర్మం కోసం పోరాడే తత్వం కనిపిస్తుంది. ఆమె ‘‘కార్యేషు దాసి’’ గా ఉంటూనేతన గౌరవానికి భంగం కలిగినప్పుడు సింహిణిలా గర్జించిన ధీరవనిత. ఈ విధంగా ద్రౌపది ఒకే సమయంలో దాసిగా సేవ చేస్తూమంత్రిగా దిశా నిర్దేశం చేస్తూతల్లిగా లాలిస్తూ ‘‘షట్కర్మ యుక్తా కులధర్మపత్ని’’ గా నిలిచింది.

మండోదరి

రాక్షస రాజ్యంలో ఉన్నప్పటికీమండోదరి తన సాత్విక గుణాన్నిధర్మనిష్ఠను ఎన్నడూ కోల్పోలేదు. మండోదరి జీవితాన్ని పరిశీలిస్తేఆమె కూడా ‘‘కార్యేషు దాసి…’’ అనే శ్లోక లక్షణాలకు అచ్చమైన నిదర్శనంగా కనిపిస్తుంది. మండోదరి లంకాధిపతికి భార్య అయినాగర్వం లేకుండా రావణుని సౌకర్యాలనుఅవసరాలను పర్యవేక్షించేది. రావణుడి పట్ల ఆమెకు ఉన్న భక్తిఅంకిత భావం చాలా ఉన్నతమైనది. భర్త ఎన్ని తప్పులు చేసినాఒక భార్యగా తన విధులను ఆమె ఎప్పుడూ విస్మరించలేదు. మండోదరి అత్యంత వివేకవంతురాలు. రావణుడు సీతమ్మను అపహ రించి తెచ్చినప్పుడుఅది వంశ నాశనానికి దారితీస్తుందని ఆమె పదే పదే హెచ్చరించింది. ఒక గొప్ప రాజనీతిజ్ఞు రాలిగామంత్రిగా ఆమె రావణుడికి హితబోధ చేసింది. శ్రీరాముడు సామాన్యుడు కాదనిసీతమ్మను తిరిగి ఇచ్చేయమని’ ఆమె చెప్పిన మాటలు ఆమెలోని దూరదృష్టికి నిదర్శనం. మండోదరి సౌందర్యం ఎంతటిదంటేహనుమంతుడు లంకలో సీతమ్మను వెతుకుతున్నప్పుడుమండోదరిని చూసి ఆమెనే సీతాదేవి ఏమో అని ఒక క్షణం భ్రమపడతాడు. ఆమె రూపం అంతటి పవిత్రతతోలక్ష్మీకళతో ఉట్టి పడేది. రావణుడు పరస్త్రీల పట్ల వ్యామోహంతో ఉన్నాతన మాట వినకుండా వినాశనం వైపు వెళ్తున్నా మండోదరి ఎంతో ఓర్పుతో భరించింది. యుద్ధంలో తన కుమారులు (మేఘనాథుడు వంటి వీరులు)భర్త మరణించినా ఆమె ఆ వేదనను దిగమింగుకుని ధర్మాన్ని అంగీకరించింది. ఆమె సహనం భూదేవితో సమానమైనది.

రావణుని వంటి మహా బలశాలికికోపిష్టికి ఆమె తల్లిలా ప్రేమగా భోజనం సమకూర్చేది. ఆయన మనసును ప్రసన్నం చేసుకోవడంలో ఆమె ఒక తల్లి పాత్రను పోషించేది. రావణుడికి ఎంతో మంది రాణులు ఉన్నామండోదరి అంటే అతనికి అత్యంత గౌరవంఇష్టం. ఆమె తన సౌందర్యంతోఅనురాగంతో రావణుడికి గొప్ప ఉల్లాసాన్నివిశ్రాంతిని ఇచ్చేది. మండోదరి వివేకానికి ప్రతీక. చుట్టూ రాక్షస ప్రవృత్తి ఉన్నాఅసుర సంస్కృతిలో ఉన్నా తనలోని ధర్మం అనే వెలుగును ఆరిపోకుండా కాపాడుకుంది. రావణుడి అంతిమ సమయంలో కూడా ఆమె అతనికి జ్ఞానబోధ చేయడానికి ప్రయ త్నించింది. మండోదరి జీవితం మనకు ఒక విషయాన్ని నేర్పుతుంది. పరిస్థితులు ఎలా ఉన్నాభాగస్వామి తప్పుడు మార్గంలో ఉన్నాధర్మాన్ని ఎలా నిర్వహించాలో ఆమె పాత్ర ద్వారా తెలుసుకోవచ్చు.

కుంతీదేవి:

మహాభారతంలో కుంతీదేవి పాత్ర ఒక గొప్ప తల్లిగాధీరవనితగా కనిపిస్తుంది. ఆమె తన జీవితాంతం అనేక కష్టాలను అనుభవిస్తూనేపాండవులను ఒక మహావృక్షంలా కాపాడింది. కుంతి చిన్నతనం నుండే అతిథి సేవలో నిమగ్నమయ్యేది. దుర్వాస మహర్షి తన తండ్రి ఇంటికి వచ్చినప్పుడుఆయనకు అత్యంత భక్తి శ్రద్ధలతో సేవలు చేసింది. ఆమె సేవలకు మెచ్చే ఆయన ఆమెకు సంతాన ప్రాప్తి’ మంత్రాన్ని ఉపదేశించారు. పాండు రాజుతో వివాహం తర్వాత కూడా వనవాసంలో ఉన్నప్పుడుఆమె ఆయనకు ఎంతో అంకితభావంతో సేవలు అందించింది. పాండవుల ఎదుగుదలలో కుంతి ఒక మంత్రిగా దిశానిర్దేశం చేసింది. బకా సురుడిని చంపమని భీముడిని పంపడం వెనుక ఆమె వ్యూహం ఉంది. అది లోకకల్యాణం కోసం తీసుకున్న కఠినమైన నిర్ణయం.

ద్రౌపది వివాహమనంతరం, ‘తెచ్చినది ఏదైనా ఐదుగురూ పంచుకోండి’ అని ఆమె చెప్పడం వెనుకపాండవుల మధ్య విభేదాలు రాకూడదనే దూరదృష్టి (రాజనీతి) ఉంది. కుంతి అత్యంత తేజస్సు కలిగిన రూపవతి. ఆమె సౌందర్యం కంటే ఆమెలోని పవిత్రతనిశ్చలత్వం ఆమెకు లక్ష్మీకళను ఇచ్చాయి. ఎందరు కష్టాలు పెట్టినా ఆమె తన హుందాతనాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. కుంతి సహనానికి మారుపేరు. చిన్న వయసులోనే భర్తను కోల్పోయినూరుగురు కౌరవుల మధ్య ఐదుగురు బిడ్డలను పెంచడం సాధారణ విషయం కాదు. గాంధారి తన బిడ్డల చావుకు పాండవులే కారణమని భావించినాకుంతి ఆమెను ఒక సోదరిలా ఆదరించింది. చివరలో ధృతరాష్ట్రుడుగాంధారిలతో పాటు వనవాసానికి వెళ్లి వారికి సేవ చేయాలని నిర్ణయించుకోవడం ఆమె అపారమైన ఓర్పుకు నిదర్శనం. ఆమె కేవలం పాండవులకే కాదుమాద్రి కుమారులైన నకులసహ దేవులకు కూడా తల్లిలాగే ప్రేమను పంచి పెంచింది. వనవాసంలో ఉన్నప్పుడు బిడ్డల ఆకలిని తీర్చడం కోసం ఆమె ఎన్నో త్యాగాలు చేసింది. పాండురాజు బతికి ఉన్నంత కాలం ఆమె ఆయనకు ప్రియమైన భార్యగామానసిక ప్రశాంతతను ఇచ్చే తోడుగా నిలిచింది. ఆయన అడవుల్లో ఉన్నప్పుడు కూడా ఆమె తన సాన్నిధ్యంతో ఆయనకు ఊరట నిచ్చింది. కుంతిని స్మరించడం వల్ల మానసిక స్థైర్యం’ కలుగుతుందని అంటారు. ఆమె జీవితం ఒక నిరంతర పోరాటం. రాజ్యంలో ఉన్నాఅడవిలో ఉన్నా ఆమె తన నైతిక విలువలను వదలలేదు. అందుకే ఆమెను ఆదర్శ గృహిణిగావీరమాతగా చరిత్ర కొలుస్తుంది. ఈ ఆరుగురు స్త్రీమూర్తులు (అహల్యసీతద్రౌపదిమండోదరితారకుంతి) భారతీయ సంస్కృతిలో స్త్రీ శక్తికి వివిధ రూపాలు. వీరు కార్యేషు దాసికరణేషు మంత్రిరూపేషు లక్ష్మిక్షమయా ధరిత్రిభోజ్యేషు మాతాశయనేషు రంభాషట్కర్మ యుక్తా కులధర్మ పత్ని’ శ్లోకంలోని ఆరు లక్షణాలను వేర్వేరు సందర్భాల్లో తమదైన శైలిలో నిరూపించుకున్నారు.

ఈ ఆరుగురు వనితలు మన సంస్కృతికి మూలస్తంభాలు. వీరి జీవిత చరిత్రలు తరతరాలకూ ఆదర్శప్రాయం. అందుకే భారతీయ సంప్రదాయంలో వీరిని నిత్యం స్మరించుకోవడం వల్ల మనిషికి మానసిక బలంపాప విముక్తి కలుగుతాయని మన పెద్దలు చెబుతారు. ‘‘ధర్మో రక్షతి రక్షితః’’ ధర్మాన్ని రక్షించిన ఈ మహాసాద్వీమణులను ధర్మమే చిరం జీవులుగా నిలబెట్టింది.

లోకం ఎంతటి క్లిష్ట పరిస్థితులను విసిరినాభర్త వల్ల లేదా సమాజం వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదురైనాతమ నైతిక విలువలను వదలకుండా నిలబడటమే ఈ ఆరుగురు మనకు నేర్పే గొప్ప పాఠం. వీరిని స్మరించడం అంటే కేవలం కథలను గుర్తు చేసుకోవడం కాదుమనలోని అంతర్గత శక్తినివిజ్ఞతను మేల్కొల్పుకోవడమే.

తరిగొప్పుల విఎల్లెన్‌ ‌మూర్తి
8008577834