News

అన్నవరం క్షేత్రానికి 200 మంది భక్తుల పాదయాత్ర

8views

జంగారెడ్డిగూడెం మండలం కేతవరం పరిసర గ్రామాల నుంచి సుమారు 200 మంది భక్తులు తూర్పుగోదావరి జిల్లా అన్నవరం క్షేత్రానికి పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సంస్థ కన్వీనర్ వరదా సత్యనారాయణ ఆధ్వర్యంలో వృద్ధులు, బాలలు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వామి దర్శనానికి ఆరేళ్లుగా పాదయాత్రలు నిర్వహిస్తున్నామని, యాత్ర మార్గంలో అనేక ఆలయాలను సందర్శించుకుంటూ వెళతామని కన్వీనర్ తెలిపారు. ఈ నెల 13వ తేదీ నాటికి పాదయాత్ర అన్నవరం చేరుతుందన్నారు. భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యం కలిగించడమే యాత్ర ఉద్దేశమన్నారు. ఈ యాత్రలో తుమ్మల సత్తిబాబు, వరదా సుధాకర్, చందు, కొయ్యల శ్రీరామ్, సతీష్ బాబు, రమణ, మోదుగల లక్ష్మణరావు, శ్రీనుబాబు, జగదీశ్వరి, సోమగిరి నాగ శిరోమణి, దుర్గ తదితరులు పాల్గొన్నారు. పాదయాత్ర భక్తులకు ఆర్ఎస్ఎస్ ప్రచార ప్రముఖ్ వేదుల జనార్దనరావు దిశానిర్దేశం చేశారు.