
ఈ సరికొత్త చొరవపై విమర్శకులు, పలు హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ జిమ్‌లో ముస్లిమేతర యువతీ యువకులకు కూడా ప్రవేశం కల్పిస్తామని ప్రకటించడం వెనుక లవ్ జిహాద్ కోణం ఏమైనా ఉందా అనే అనుమానాలను విమర్శకులు లేవనెత్తుతున్నారు. కఠినమైన మతాధారిత ఆంక్షలు విధిస్తూనే, అన్ని మతాల వారికి స్వాగతం అనడం వెనుక ఇతర మతాల యువతీ యువకులను ఆకర్షించే వ్యూహం దాగి ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలనలో మహిళలపై విధించే ఆంక్షల తరహాలోనే ఈ నియమాలు ఉన్నాయని, ఇది కేరళ సమాజంలో ఇస్లామిక్ ఛాందసవాదం పెరుగుతోందనడానికి సంకేతమని వారు ఆరోపిస్తున్నారు. గతంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI), నేషనల్ డెవలప్‌మెంట్ ఫ్రంట్ (NDF) వంటి నిషేధిత సంస్థలు కొన్ని జిమ్‌లను ఆయుధ శిక్షణ కోసం ఉపయోగించుకున్నాయనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, ఈ తాజా పరిణామం మరింత ఆందోళన కలిగిస్తోందని విమర్శకులు ఎత్తిచూపుతున్నారు.
జిమ్ నియమ నిబంధనలు ఇవే: సదరు యజమాని ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ జిమ్‌లో కఠినమైన ఇస్లామిక్ నిబంధనలు ఇవే…
- సంగీతంపై నిషేధం: సాధారణంగా జిమ్‌లలో ఉండే మ్యూజిక్ లేదా పాటలు ఇక్కడ పూర్తిగా నిషిద్ధం.
- వస్త్రధారణపై ఆంక్షలు: మహిళలు తప్పనిసరిగా హిజాబ్ ధరించాలి. ఇస్లామిక్ బోధనల ప్రకారం ఇతరుల ముందు కప్పుకోవలసిన శరీర భాగాలను (ఔరత్ మరియు అవ్రాహ్) పూర్తిగా కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి.
- వేర్వేరు సమయాలు: పురుషులు మరియు మహిళలు కలిసి ఒకే సమయంలో శిక్షణ తీసుకోవడానికి వీల్లేదు. ఇరు వర్గాలకు వేర్వేరు సమయ స్లాట్‌లను కేటాయిస్తారు.
ఈ కఠినమైన నియమ నిబంధనలను అంగీకరిస్తే, ముస్లిమేతరులతో సహా అన్ని మతాల వారికి ఈ జిమ్‌లో ప్రవేశం ఉంటుందని యజమాని తన పోస్ట్‌లో స్పష్టం చేశారు. అయితే, సాధారణంగా జిమ్‌లలో ఉండే ప్రత్యేక వ్యాయామ దుస్తులకు భిన్నంగా, ఇక్కడ పర్దా మరియు హిజాబ్ వంటివి తప్పనిసరి చేయడంపై సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఒక వ్యక్తి తన సొంత వ్యాపారాన్ని ఏ నియమాలతోనైనా నడుపుకునే హక్కు చట్టపరంగా ఉన్నప్పటికీ, ఇలాంటి మతాధారిత ఆంక్షలతో కూడిన జిమ్‌ను తీసుకురావడం ,దీని వెనుక ‘లవ్ జిహాద్’ వంటి విస్తృత సామాజిక మార్పుల వ్యూహాలు ఉన్నాయనే ఆరోపణలు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.





