
భారతదేశంలో మతమార్పిడుల కోసం విదేశీ నిధులు వస్తున్నాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పక్కాగా ధ్రువీకరించింది. అక్రమంగా మతమార్పిళ్లు చేస్తూ అమెరికాతో ప్రత్యక్ష సంబంధాలున్న క్రైస్తవ మిషనరీ ముఠా అక్రమ కార్యకలాపాలను ఈడీ ఛేదించింది. ఛత్తీస్ గఢ్ లోని నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో మత మార్పిడులను సులభతరం చేయడానికి ఈ నిధులను అక్కడికి మళ్లించారని కూడా ఈడీ కనిపెట్టింది. అమెరికాకు చెందిన మిషనరీ సంస్థ “ది తిమోతి ఇనిషియేటివ్” (TTI)తో సంబంధం పెట్టుకున్న భారత్లోని మిషనరీలు దేశవ్యాప్తంగా సుమారు 95 కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినట్లు ఈడీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ మొత్తం 95 కోట్లలో 6.5 కోట్లు ఛత్తీస్ గఢ్ లోని ధమ్తరి, బస్తర్ ప్రాంతాలకు పంపించారని కూడా తేల్చింది.
విదేశీ బ్యాంకు డెబిట్ కార్డులను ఉపయోగించి కూడా భారతదేశంలో పదేపదే నగదును విత్అ డ్రా చేస్తున్నట్లు కూడా ఈ దర్యాప్తులో వెల్లడైంది. ఈ నిధులపై దర్యాప్తు చేస్తున్న సమయంలో ఈడీ పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సమయంలోనే అమెరికా హస్తముందని బయటపడింది. ఈ ఆపరేషన్ సమయంలో, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ‘మికా మార్క్’ అనే వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 25 విదేశీ డెబిట్ కార్డులు, రూ.40 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అమెరికాకు చెందిన Truist Bank’ డెబిట్ కార్డులను భారతదేశానికి తీసుకువచ్చి, వాటిని ఉపయోగించి ATMల ద్వారా నిరంతరాయంగా నగదును తీసేవారని కూడా ఈడీ తన పత్రికా ప్రకటనలో పేర్కొంది. గత కొన్నేళ్లుగా, ఛత్తీస్గఢ్లోని వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో ఈ కార్డులను ఉపయోగించి భారీ మొత్తంలో నగదును “అసాధారణ”, “సందేహాస్పద” రీతిలో విత్ డ్రా చేశారని కూడా పేర్కొంది. ఈ నిధులు, క్రైస్తవ మత ప్రచారం, విస్తరణ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్న The Timothy Initiative’ అనే మిషనరీ సంస్థతో ముడిపడి ఉన్నాయని కూడా ఈడీ ప్రకటించింది. ఆ సంస్థ, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) కింద నమోదు కానప్పటికీ, భారతదేశంలోని తన ఖర్చుల కోసం ఈ నిధులను వినియోగించుకుందని ఈడీ తెలిపింది. అంతేకాకుండా ఈ నిధులు ఇంకా ఏయే అవసరాలకు ఉపయోగించారో కూడా వెలికి తీసే పనిలో ఈడీ నిమగ్నమైంది.
ఈడీ దర్యాప్తును కాస్త పక్కన పెడితే, బస్తర్ పూర్తిగా నక్సల్స్ ఉండే ఏరియా (ఆపరేషన్ కగార్ తో ఇప్పుడు నక్సల్స్ రహితంగా మారింది) కాగా, ధమరి పాక్షికంగా నక్సల్స్కి పట్టున్న ప్రాంతం. చాలా సంవత్సరాల వరకు ఇక్కడ రహదారులు, విద్యుత్ సౌకర్యాలు కూడా వుండేవి కావు. కానీ.. అక్కడ చర్చిలు వెలిశాయి. పాస్టర్లు కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్డారు. మావోయిస్టుల హింసతో అట్టుడికిపోయే ఈ ప్రాంతాల్లో అక్కడి స్థానికులు వెళ్లడానికి కూడా కాస్త జంకేవారు. కానీ.. క్రైస్తవ మిషనరీలు మాత్రం అక్కడికి ఎలా వెళ్లగలిగాయి? నిర్భయంగా ఎలా సంచరించేవారు? ఎవరి ఇళ్లల్లో ఉండేవారు? మావోలు వారికి సహకరించేవారా? అన్న ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. అలాగే క్రైస్తవ మిషనరీలకు, మావోలకు మధ్య ఆర్థిక లావాదేవీలు ఏమైనా సాగేవా? అన్న అనుమానాలు కూడా వస్తుంటాయి




