News

ఆవుపై లైంగిక దాడి చేసిన షాబాజ్ ఆలం అరెస్టు

6views

బెంగళూరులో ఆవుపై అమానుషంగా ప్రవర్తించాడనే ఆరోపణలపై పోలీసులు ఒక యువకుడిని అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, 24 ఏళ్ల షాబాజ్ ఆలం అనే వ్యక్తి రోడ్డుపై నిద్రిస్తున్న ఆవుపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి.

నిందితుడు నగరంలోని కాటన్‌పేట ప్రాంతంలో నివసిస్తూ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. మే 5వ తేదీ రాత్రి అక్కిపేట క్రాస్ రోడ్ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ఈ సంఘటనకు సంబంధించిన సమాచారం మే 17న సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం పోలీసులు స్వయంగా (*సుమోటో) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా షాబాజ్ ఆలంను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనపై స్థానికంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. గోసంరక్షణ సంఘాలు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.