News

హరిత మంత్రాలయంగా తీర్చిదిద్దుదాం : పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థుల పిలుపు

7views

సుబుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో మంత్రాలయాన్ని హరితవనంగా తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  రం డీజీవీ అతిథి గృహం సమీపంలోని హైవే రోడ్డులో డివైడర్ మధ్య నాటిన మొక్కలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కార్యక్రమాన్ని పీఠాధిపతులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంత్రాలయం ప్రాంతాన్ని పచ్చదనంతో నింపి “హరిత మంత్రాలయం”గా అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు. పట్టణ పరిసరాలతో పాటు మఠానికి చెందిన అతిథి గృహాలు, తులసీ వనం, గోశాల, బృందావన్ గార్డెన్, సుశమీంద్ర తీర్థుల పార్క్, గురునివాస్, ప్రధాన రహదారుల వెంట విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.

ఈ హరిత కార్యక్రమాల నిర్వహణ, మొక్కల సంరక్షణ బాధ్యతలను పీ.వీ. బద్రినాథ్ రావు స్వీకరించారు. ఇందుకోసం సుమారు రూ.15 లక్షలు వ్యయం చేస్తున్నట్లు తెలిపారు.

సేవా కార్యక్రమంలో విశేష సహకారం అందిస్తున్న బద్రినాథ్ రావును పీఠాధిపతులు శాలువాతో సత్కరించి, పూలమాలలు వేసి, అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించారు.

భక్తుల సహకారంతో మంత్రాలయాన్ని ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణ పరిరక్షణలోనూ ఆదర్శంగా నిలపాలని మఠాధికారులు ఆకాంక్షించారు.