News

భోపాల్ లో ‘‘సర్ తాన్ సే జుడా’’ నినాదాలు..

6views

భోపాల్ కేంద్రంగా ముస్లిం ఛాందసులు రెచ్చిపోతున్నారు. ‘‘సర్ తాన్ సే జుదా (తల నుంచి మొండెం వేరుచేస్తాం) అంటూ నినాదాలిచ్చారు. భోపాల్ లోని పోలీస్ కమిషనరేట్ బయట వందలాది ఇస్లామిక్ ఛాందసులు గుమిగూడి, ఈ నినాదాలిచ్చారు. దీంతో పెద్ద వివాదమే రేగింది.ఇస్లాంను విమర్శించారని, దైవ దూషణ చేశారంటూ, కొందరి టార్గెట్ చేశారు ముస్లింలు.

సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్న వీడియోలలో, గుంపులోని కొంతమంది “నారా-ఎ-తక్బీర్”, “అల్లాహు అక్బర్” వంటి మతపరమైన నినాదాలు చేయడం; మరికొందరు పాల్గొన్నవారు హిందూ సంస్థలసభ్యులపై, ముఖ్యంగా బజరంగ్ దళ్ సభ్యులపై బహిరంగంగానే బెదిరింపులకు దిగారు.

అయితే.. గోవిందపుర ప్రాంతంలోని ఓ హోటల్ లో ముస్లిం వ్యక్తి, హిందూ మహిళ కలిసి వున్నట్లు తేలింది. దీంతో ఆ మహిళను హిందూ సంఘాల వారు నిలదీశారు. ఈ నేపథ్యంలోనే ముస్లిం ఛాందసులు సర్ తాన్ సే జుదా అంటూ నానిదాలిచ్చారు. అంతేకాకుండా ఇది లవ్ జిహాద్ కేసు అంటూ హిందువులు ఆరోపించారు.

పోలీస్ కమిషనరేట్ వెలుపల నిరసన సందర్భంగా, ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) రాష్ట్ర అధ్యక్షుడు మొహ్సిన్ అలీ ఖాన్ ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేసే ఉద్రేకపూరిత ప్రసంగాలు చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. భోపాల్ ముస్లింలు వారిని ఇకపై సహించరు. మేము వారిని వీధుల్లోకి ఈడ్చి చంపేస్తాం… మేము మీ అమ్మాయిలను పట్టుకోవడానికి వస్తే, వారిని రోడ్ల మీదే కొడతాం… వారు ఎక్కడ కనిపించినా, వారిని చితకబాదుతాను. పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను.” అంటూ రెచ్చిపోయారని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు.

సర్ తాన్ సే జుదా విషయంలో అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పిందంటే…

సర్ తాన్ సే జుదా విషయంలో అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది వాక్ స్వాతంత్రం కాదని, మతపరమైన భావన ప్రకటన కాదని తేల్చి చెప్పింది. రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ, సార్వభౌమాధికారంపై ప్రత్యక్ష దాడి అని తేల్చి చెప్పింది. “I Love Muhammad” వివాదానికి సంబంధించిన బరేలీ హింసాకాండలో నిందితుడైన రిహాన్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ, పై వ్యాఖ్యలు చేసింది.

సర్ తాన్ సే జుదా.. వ్యాఖ్యలు ఎక్కడెక్కడ జరిగాయో కొన్ని ఉదాహరణలు…

సెప్టెంబర్ 7,2025

మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లింలు ర్యాలీ తీశారు. ఈ సమయంలోనే సర్ తాన్ సే జుడా నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా వచ్చాయి. దీంతో హిందూ సంఘాలు ఫిర్యాదు చేశాయి.

అక్టోబర్ 10,2024

యూపీలోని బహ్రాయిచ్ ప్రాంతంలో జరిగింది. ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఒక హిందూ, ఒక ముస్లిం బాలుడి మధ్య జరిగిన సంభాషణ జరిగింది. ఇది ముదరడంతో ముస్లిం ఛాందసులు సర్ తాన్ సే జుడా అంటూ రెచ్చిపోయారు.ఈ ర్యాలీకి కాంగ్రెస్ నేత నాయకత్వం వహించాడు.

అక్టోబర్ 22,2024

హైదరాబాద్ లోని రెయిన్ బజార్ ఈ ఘటన జరిగింది. సోషల్ మీడియా వేదికగా దైవ దూషణ చేశాడంటూ ఓ యువకుడికి వ్యతిరేకంగా ముస్లిం గుంపు గుమిగూడి ఆందోళన నిర్వహించింది. పోస్టులో మహ్మద్ ప్రవక్త విషయంలో అభ్యంతరకరంగా వుందని, ఆ యువకుడిపై కఠిన చర్య తీసుకోవాలని ముస్లిం గుంపు డిమాండ్ చేసింది. ఈ సమయంలోనే సర్ తాన్ సే జుడా అంటూ ఛాందసులు రెచ్చిపోయారు.