News

యూసీసీ కింద మొదటి కేసు నమోదు..

24views

హరిద్వార్ లో యూసీసీ కింద మొదటి కేసు నమోదైంది. హలాలాకు సంబంధించిన విషయంలో నమోదైంది. రాష్ట్రంలో UCC అమల్లోకి వచ్చిన తర్వాత ఇటువంటి ఘటన చోటుచేసుకోవడం ఇదే మొదటిసారి. ఓ వ్యక్తిపై అతని భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అతనిపై, అతని కుటుంబీకులపై కేసు నమోదైంది.
షాహిన్ అనే మహిళ భర్త మహ్మద్ డానిష్ పైనా, వారి కుటుంబంలో ఇతరులై తీవ్ర ఆరోపణలు మోపింది. తన భర్త తనను రోజూ వేధించేవాడని, ఫిర్యాదులో పేర్కొంది.హలాలా వంటి ఆచరణలను నిర్దిష్టంగా నిషేధించి, శిక్షించే ‘యూనిఫాం సివిల్ కోడ్, ఉత్తరాఖండ్ 2024 (సవరణ 2026)’లోని సెక్షన్లు 32(1)(ii) మరియు 32(1)(iii)లను పోలీసులు కేసులు పెట్టారు.

Uniform Civil Code, Uttarakhand 2024: Sections 32(1)(ii) and 32(1)(iii).
Bharatiya Nyaya Sanhita (BNS), 2023: Section 115(2) (Voluntarily causing hurt) and Section 85.
Muslim Women (Protection of Rights on Marriage) Act, 2019: Sections 3 and 4 (Related to Triple Talaq).
Dowry Prohibition Act, 1961: Sections 3 and 4. కింద కేసులు నమోదయ్యాయి.

పోలీసులు అభియోగపత్రాన్ని రూపొందించి, రూర్‌కీలోని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్-II న్యాయస్థానంలో సమర్పించారు. ప్రధాన నిందితుడైన డానిష్‌తో పాటు, అతని తండ్రి మహమ్మద్ అర్షద్‌ను, అలాగే పర్వేజ్, జావేద్ మరియు గుల్షానాలను కూడా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.