
మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నాయకుడు నితేష్ రాణే ఏఐఎంఐఎంపై తన విమర్శలను మరింత తీవ్రతరం చేశారు. నాసిక్ టీసీఎస్ మత మార్పిడి, లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితురాలైన నిదా ఖాన్‌కు ఏఐఎంఐఎం కార్పొరేటర్ మతిన్ మజీద్ పటేల్ ఆశ్రయం కల్పించారన్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పై తీవ్ర విమర్శలు చేసిన రాణే, ఆ పార్టీని “ఉగ్రవాద భావజాలాన్ని ప్రోత్సహించే సంస్థ”గా అభివర్ణించారు. అలాగే పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ను అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ తో పోల్చారు.
ఒకప్పుడు బిన్ లాడెన్ నాయకత్వంలోని అల్-ఖైదా కు చెందిన భావజాలాన్ని ఇప్పుడు రాజకీయ రూపంలో ఏఐఎంఐఎం కొనసాగిస్తోందని రాణే ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలు మహారాష్ట్రతో పాటు జాతీయ రాజకీయ వర్గాల్లో వైరల్ గా మారాయి.
ఇక ప్రతిపక్ష పార్టీలు రాణే వ్యాఖ్యలను ఖండిస్తుండగా, బీజేపీ వర్గాలు మాత్రం దేశ భద్రత, మత మార్పిడి అంశాలపై కఠినంగా స్పందించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నాయి.





