
38views
నాసిక్ టీసీఎస్ కార్పొరేట్ జిహాద్ కేసులో ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ తప్పించుకోవడానికి సహాయపడిన ఎంఐఎం కౌన్సిల్ అబ్దుల్ మతీన్ పటేల్ అరెస్ట్ అయ్యారు. ప్రధాన నిందితురాలు నిదాఖాన్ 25 రోజులపాటు కనిపిచంకుండా పోయారు. ఇందులో అబ్దుల్ మతీన్ దే కీలక పాత్ర అని, ఆయనే ఆశ్రయం కల్పించారని ఆరోపణలు వున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేశారు.
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ కి అబ్దుల్ మతీన్ కౌన్సిలర్ గా పనిచేస్తున్నారు. ఓ నేరస్థురాలికి సహకరించినందుకు ఆయనపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. అలాగే ఆమెకు ఆశ్రయం కల్పించారన్న ఆరోపణలు రావడంతో వాటిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విచారణాధికారుల ప్రకారం, నాసిక్‌లోని టీసీఎస్‌కు అనుబంధంగా ఉన్న బీపీఓ యూనిట్‌కు సంబంధించిన మతమార్పిడి మరియు లైంగిక వేధింపుల రాకెట్‌పై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా అబ్దుల్ మతీన్ పటేల్‌ను నాసిక్ క్రైమ్ బ్రాంచ్ అదుపులోకి తీసుకుంది.
నాసిక్ టీసీఎస్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత, నిదాఖాన్ పై ఆరోపణలు వచ్చిన తర్వాత దాదాపు 25 రోజుల పాటు తప్పించుకు తిరిగారు నిదాఖాన్. చివరికి పోలీసులు ఛత్రపతి శంభాజీ నగర్‌లో అరెస్టు చేసిన ఓ రోజు తర్వాత అబ్దుల్ మతీన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ఖాన్ బంధువులతో కలిసి ఉంటున్నట్లు సమాచారం ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో ఆమెను గుర్తించారు. తదుపరి విచారణ కోసం నాసిక్‌కు తీసుకురావడానికి ముందు, బదిలీ వారెంట్‌పై ఆమెను స్థానిక కోర్టులో హాజరుపరిచారు.
నాసిక్ లోని టీసీఎస్ లో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి ప్రయత్నాలు, మతపరమైన భావాలను దెబ్బతీస్తున్నట్లు నిదా ఖాన్ పై ఆరోపణలున్నాయి. అక్కడి ఉద్యోగులు కూడా నిదా ఖాన్ చేసిన పనులను వెలుగులోకి తెస్తున్నారు. అయితే.. ఈ వ్యవహారాలన్నీ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి నిదాఖాన్ పరారీలో వున్నారు. గత 25 రోజులుగా ఆమెఅజ్ఞాతంలో ఉన్నారు.ఈమెను పట్టుకునేందుకు పోలీసులు పలు బృందాలుగా విడిపోయి, విస్తృతంగా గాలించారు.
మరో వైపు ఈ కేసు దర్యాప్తు కోసం నాసిక్ పోలీసులు సిట్ ను ఏర్పాటు చేశారు. టీసీఎస్ క్యాంపస్ లో లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిళ్లకు సంబంధించి మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మేనేజర్ సహా 8 మంది అరెస్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే నిదాఖాన్ పేరు బయటికి వచ్చింది. కంపెనీలో సీనియర్ అయిన నిదాఖాన్ వాట్సాప్ గ్రూపుల్లో ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని, వేధింపులకు దిగుతోందని తెలిసిపోయింది.
ఇస్లాం సిద్ధాంతాలనే అనుసరించాలి, ఆ మతానికి సంబంధించిన దుస్తులే ధరించాలని మహిళా ఉద్యోగులను పదే పదే వేధించేదని, బలవంతపెట్టేదని దర్యాప్తులో వెల్లడైంది. దీంతో పోలీసులు ఆమెపై కేసులు నమోదు చేశారు. దీంతో ఆమె ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించింది. ఆమె పిటిషన్ ను మాత్రం న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఈ కేసు తీవ్రత పెరిగిపోవడంతో నిదాఖాన్ పరారీలో వుంది.చివరికి ఛత్రపతి శంభాజీనగర్ లో ఆమె ఆచూకీని గుర్తించి, అరెస్ట్ చేశారు.




