News

ప్లాస్టిక్ వ్యర్థాలతో ఆదాయాన్ని సమకూర్చుకుంటున్న బదరీనాథ్ ధామ్

51views
బదరీనాథ్ లో ప్లాస్టిక్ వ్యర్థాలు ఆదాయ వనరులుగా మారాయి. ఈ మేరకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కేవలం ఒక్క వారంలోనే 8 టన్నుల వ్యర్థాల ద్వారా 84,000 రూపాయల ఆదాయాన్ని తెచ్చుకున్నారు. చమోలిలోని బద్రీనాథ్ ధామంలో స్థానిక నగర పంచాయతీ ప్లాస్టిక్ వ్యర్థాలను విజయవంతంగా ఆదాయ వనరుగా మార్చుకుంది. చార్ ధామ్ యాత్ర ప్రారంభమైన కేవలం వారం రోజుల్లోనే 8 టన్నుల వ్యర్థాల ద్వారా 84,000 రూపాయల ఆదాయాన్ని ఆర్జించారు. దీంతో పారిశుద్ధ్య నిర్వహణలో ఓ నమూనాగా నిలబడింది.
గత యేడాది సుమారు 230 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలించగా, ఈ యేడాది చార్ ధామ్ యాత్ర ప్రారంభమైన కేవలం వారం రోజుల్లోనే 8 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల ద్వారా 84 వేల రూపాయలను ఆర్జించారు. నగర పంచాయతీ పాదాచారుల మార్గాలు, రహదారులు, విశ్రాంతి గదుల శుభ్రత, అలాగే వ్యర్థాల నిర్వహణను కూడా పర్యవేక్షిస్తోంది. సేంద్రీయ, అసేంద్రీయ వ్యర్థాలను వేరుచేసి, శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి, వాటిని నిర్మూలిస్తోంది. దీని ద్వారా ఆదాయాన్ని కూడా ప్రభుత్వం ఆర్జిస్తోంది.
“Environment Friends” సహకారంతో, సేంద్రియ వ్యర్థాలను కంపోస్టుగానూ, ప్లాస్టిక్ వ్యర్థాలను దిమ్మెలుగానూ మార్చి విక్రయిస్తున్నారు. ఈ చొరవ పరిశుభ్రతను పెంపొందించడమే కాకుండా, నగర పంచాయతీకి అదనపు ఆదాయాన్ని కూడా సమకూరుస్తోంది.నగర పంచాయతీ ద్వారా సమకూరిన ఆదాయం వనరుల అభివృద్ధికి మరియు ఇతర అత్యవసర కార్యకలాపాలకు వినియోగించనున్నారు. ఈ నమూనా ఇప్పుడు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది.
kedar2
అలాగే తడి వ్యర్థాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. వీటి కోసం శాశ్వతమైన గుంతలను కూడా ఏర్పాటు చేశారు. యాత్ర ప్రారంభమైనప్పటి నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ వ్యర్థాలు, వాటర్ బాటిల్స్ పేరుకుపోతాయని ముందే గ్రహించారు. ఈ పరిస్థితిని ఎదుర్కోడానికి కేదార్‌నాథ్ నగర పంచాయతీ ముందే ప్రణాళిక వేసుకుంది.
ఈ లక్ష్యంతో, నగర పంచాయతీ పుణ్యక్షేత్రంలో 3,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక మెటీరియల్ రికవరీ ఫెసిలిటీని ఏర్పాటు చేసింది. ఇక్కడ, పుణ్యక్షేత్రం నుండి సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలు మరియు ఇతర ఘన వ్యర్థాలను సేకరించి 15 విభిన్న వర్గాలుగా వేరు చేస్తారు. ఈ వ్యర్థాలలో ప్రధానంగా ప్లాస్టిక్, గాజు, టిన్ మరియు వస్త్రాలు ఉంటాయి. ఈ కేంద్రంలో నగర పంచాయతీ ఒక కాంపాక్టర్ యంత్రాన్ని కూడా ఏర్పాటు చేసింది; ఈ యంత్రం సీసాల వంటి ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేస్తుంది.
గాజు మరియు తగరం వంటి వివిధ రకాల వ్యర్థాలను అక్కడికక్కడే సేకరించి, ఈ వ్యర్థాలను సోన్‌ప్రయాగ్‌కు తరలించి, స్క్రాప్‌గా విక్రయిస్తున్నారు. ఈ వ్యర్థాలను ఉదయం, సాయంత్రం రెండు పూటలా సేకరిస్తున్నారు. దీని ద్వారా ఆ ప్రాంతాలు అత్యంత పరిశుభ్రంగా వుంటున్నాయి.