News

పాక్‌ సరైన మధ్యవర్తి కాదు

24views

ఇరాన్‌-అమెరికా మధ్య ప్రత్యక్ష చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడిన వేళ పాకిస్థాన్‌ మధ్యవర్తిత్వంపై ఇరాన్‌ ఎంపీల్లో అసంతృప్తి వ్యక్తమైంది. పాక్‌ నేతలు తటస్థంగా వ్యవహరించడం లేదని.. వారు అమెరికాకు అనుకూలంగా ఉంటున్నారని.. దీంతో చర్చల్లో విశ్వసనీయత కొరవడుతున్నదని ఒక ఎంపీ విమర్శించారు. ఇరాన్‌ ఎంపీ, ఆ దేశ జాతీయ భద్రత, విదేశాంగ విధాన కమిషన్‌ సభ్యుడైన ఇబ్రహీం రెజాయి అభిప్రాయం ప్రకారం… ‘పాకిస్థాన్‌ మాకు మంచి మిత్ర దేశం, పొరుగు రాజ్యం కూడా. అయితే సరైన మధ్యవర్తిత్వానికి, చర్చలకు ఆ దేశం సరిపోదు. అందుకు అవసరమైన విశ్వసనీయత ఆ దేశానికి లేదు’ అని ఆయన ఎక్స్‌ పోస్ట్‌లో తెలిపారు. అమెరికా ఆకాంక్షలకు వ్యతిరేకంగా పాక్‌ ఒక్క మాట కూడా చెప్పదని ఆయన వ్యాఖ్యానించారు.