
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని నూతన బ్రాహ్మణ భవనలో ఆదిగురువు శంకరాచార్యుల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శంకరాచార్యుల విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జోష్యం జనార్దన శాస్త్రి హాజరయ్యారు.
ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘం పట్టణ అధ్యక్షుడు రాచకొండ జానకిరామశర్మ మాట్లాడుతూ బ్రాహ్మణ సంఘం బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తామని పేర్కొన్నారు. పట్టణంలోని బ్రాహ్మణ సంఘ భవన నిర్మాణం పూర్తిచేస్తానన్నారు. ఆది శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడని పేర్కొన్నారు. సంఘం డైరెక్టర్ రాచకొండ హర్షశర్మ మాట్లాడుతూ శంకరాచర్యుల జీవితం యువతకు ఆదర్శమని, ఆయన బోధనలు మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి బాల ఎల్లయ్యస్వామి, కోశాధికారి హరిప్రసాద్, సభ్యులు పాల్గొన్నా





