News

అయోధ్య రాముణ్ణి దర్శించుకున్న 30 మంది అంధ విద్యార్థులు

33views

హర్యానాలోని రోహ్‌తక్‌కు చెందిన నారీ ఉదయ్ ఫౌండేషన్ వారి ‘అంధ ప్రకాష్ విద్యాలయం’కు చెందిన 30 మంది దృష్టి లోపం ఉన్న విద్యార్థుల బృందం  ఉత్తర ప్రదేశ్ అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి ఆలయాన్ని సందర్శించి శ్రీరాముని దర్శనం చేసుకుంది.

దృష్టి లోపం ఉన్న భక్తుల సంరక్షణ చూసుకుంటున్న రాణి హూడా అహ్లావత్  మాట్లాడుతూ, ఈ సందర్శనను పూర్తి భక్తిశ్రద్ధలతో,  చేపట్టామని చెప్పారు.  “మేము శ్రీరాముని దర్శనం కోసం అయోధ్యకు వచ్చాము. నా పాఠశాలలోని దృష్టి లోపం ఉన్న విద్యార్థులందరినీ నాతో పాటు తీసుకువచ్చాను.  రామ మందిరంలో ప్రదక్షిణ చేసి హనుమాన్ చాలీసా పఠించాము.” ఆలయ సందర్శన సమయంలో తాము పొందిన ఆధ్యాత్మిక అనుభూతిని  విద్యార్థులు మనస్ఫూర్తిగా అభినందించారని  తెలిపారు.

విద్యార్థులలో ఒకరైన సప్నా కూడా  మాట్లాడుతూ, “మేము శ్రీరాముని దర్శనం కోసం అయోధ్యకు వచ్చాము. మాకు శక్తిని ప్రసాదించమని శ్రీరాముడిని ప్రార్థించాము. ఆలయ ప్రాంగణంలో శ్రీరాముని నామాన్ని జపించి, హనుమాన్ చాలీసా పఠించాము” అని అన్నారు.