
సి ఏ ఏ కు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అల్లర్లలో ముష్కరుల దాడిలో మృతి చెందిన పోలీసు అమరవీరులు రతన్ లాల్, అంకిత్ శర్మలకు హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లో ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా హిందూ ఐక్యవేదిక నాయకుడు శ్రీ చైతన్య మాట్లాడుతూ సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో ముష్కర మూకలు పోలీసులను దారుణంగా హత్య చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ ఘటనకు ప్రత్యక్షంగా పరోక్షంగా బాధ్యులైన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించి భవిష్యత్తులో ఇలాంటి దారుణాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నాయకుడు శ్రీ రాఘవ రాజు, హిందూ యువశక్తి నాయకులు శ్రీ చిక్కాల రజనీకాంత్, శ్రీ సాయి పవన్, శ్రీ ఉప్పలపాటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా తెనాలిలో సైతం ఆ పోలీసు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.





