News

ఉపరాష్ట్రపతితో ఏబీవీపీ ప్రతినిధుల భేటీ

155views

అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీబీపీ) జాతీయ ప్రతినిధి బృందం  ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ను దిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసింది. దేశ నిర్మాణంలో యువత పాత్ర, విద్యార్థుల సంక్షేమం, ఉన్నత విద్యారంగంలో సమకాలీన అంశాల గురించి వారు చర్చించారు. పంజాబ్ యూనివర్సిటీలోని పలు సమస్యలను ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. ఏబీవీపీ నిర్వహిస్తున్న స్టూడెంట్స్ ఎక్స్ పీరియన్స్ ఇన్ ఇంటర్టేట్ లివింగ్ (ఎస్ఈఐఎల్) కార్యక్రమం 60 ఏళ్లు పూర్తి చేసుకుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. యువతలో డిజిటల్ వ్యసనాన్ని తగ్గించడానికి చేపట్టిన ‘స్క్రీన్ టైమ్ టు యాక్టివిటీ టైమ్’ కార్యక్రమ వివరాలను పంచుకున్నారు