News

అమర్​నాథ్​ యాత్ర రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం​​- ఎక్కడ? ఎలా చేసుకోవాలో తెలుసా?

51views

హిందువుల అత్యంత పవిత్ర యాత్రల్లో ఒకటైన అమర్​నాథ్​ యాత్ర 2026 కోసం నమోదు ప్రక్రియ బుధవారం నుంచి అధికారికంగా ప్రారంభమైంది. కశ్మీర్​ హిమాలయాల్లో జరిగే ఆ యాత్ర 2026 జులై 3వ తేదీన ప్రారంభమై ఆగస్టు 28 వరకు కొనసాగునుంది. ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా లక్షలాది భక్తులు పాల్గొననున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఆన్​లైన్​ ద్వారా నమోదు సదుపాయం
ఈ సంవత్సరం యాత్రకు నమోదు ప్రక్రియ మరింత సులభతరం చేయడానికి ఆన్​లైన్​, ఆఫ్​లైన్​ రెండు విధానాలను అందుబాటులో ఉంచారు. భక్తులు శ్రీ అమర్​నాథ్​ శ్రైన్​ బోర్డ్​ అధికార వెబ్​సైట్​ ద్వారా ఆన్​లైన్​లో నమోదు చేసుకోవచ్చు. అదే విధంగా దేశవ్యప్తంగా 550కి పైగా గుర్తింపు పొందిన బ్యాంక్​ శాఖల్లో కూడా నమోదు సదుపాయం కల్పించారు. ఇందులో స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా, పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​, యెస్ బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంక్​, ఈసీఈసీ బ్యాంక్​లు​ ఉన్నాయి.

Amarnath Yatra Registration Process

అమర్​నాథ్​ యాత్ర రిజిస్ట్రేషన్​ ప్రాసెస్ కోసం వచ్చిన భక్తులు 

ముందస్తు నమోదు అవసరం
యాత్రలో పాల్గొనే భక్తులు వీలైనంత త్వరగా నమోదు పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. ఎంపిక చేసిన యాత్ర వివరాలు తేదీకి ఏడు రోజుల ముందుగానే మూసివేస్తారని తెలిపారు. నమోదు పూర్తయిన భక్తులకు సిస్టమ్​ ద్వారా యాత్రా పర్మిట్​ పత్రం అందుతుందని అన్నారు. దానిలో తేదీ, ఎంచుకున్న మార్గం, ప్రవేశ సమయం వంటి వివారాలు స్పష్టంగా ఉంటాయి.

రక్షణ కోసం ప్రత్యక ఏర్పాట్లు
అంతే కాకుండా ఈ సంవత్సరం భద్రతా చర్యలు కట్టుదిట్టంగా మార్చారని తెలిపారు. అందులో భాగంగా యాత్ర సమయంలో యాత్రికుల కదలికలను పర్యవేక్షించేందుకు వీలుగా ప్రతి వ్యక్తికి ఆర్​ఎఫ్​ఐడీ(రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్​) కార్డులు జారీ చేస్తారని చెప్పారు. యాత్రను సురక్షితంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు వీలుగా యాత్రికలు వైద్య పరీక్ష చేయించుకుని, తప్పనిసరి వైద్య ఫారాలను సమర్పించాలని కూడా పరిపాలన యంత్రాంగం ఆదేశించింది.

అమర్‌నాథ్ యాత్ర భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన మతపరమైన యాత్రలలో ఒకటి. ఇక్కడ లక్షలాది మంది భక్తులు సహజంగా ఏర్పడిన మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి కష్టతరమైన పర్వత మార్గాల గుండా ప్రయాణిస్తారు. ఈ ఏడాది యాత్ర జూలై 3 నుంచి ప్రారంభమై, మొత్తం 57 రోజుల పాటు కొనసాగనుంది. అంటే ఆగస్టు 28న రక్షా బంధన్ సందర్భంగా ముగియనుంది.

Amarnath Yatra Registration Process

అమర్‌నాథ్ యాత్రకు ఎలా నమోదు చేసుకోవాలి?
యాత్రకు వెళ్లాలని అనుకునేవారందరికీ అధికారులు రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేశారు. భక్తులు రెండు అధికారిక పద్ధతుల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు :

  • శ్రీ అమరనాథ్‌జీ ష్రైన్ బోర్డ్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ నమోదు
  • దేశవ్యాప్తంగా నిర్దేశిత బ్యాంకు శాఖలలో ఆఫ్‌లైన్ నమోదు
  • చెల్లుబాటు అయ్యే ప్రయాణ అనుమతిని పొందే ముందు దరఖాస్తుదారులు వ్యక్తిగత వివరాలు, పత్రాలు సమర్పించి, ధ్రువీకరణను పూర్తి చేయాలి. ఈ అనుమతి లేకుండా, పుణ్యక్షేత్ర మార్గంలోకి ప్రవేశం అనుమతి లేదు.

    అర్హత, ఆరోగ్య అవసరాలు ఏమిటి?

  • వయోపరిమితి: 13 నుంచి 70 సంవత్సరాలు
  • తప్పనిసరి ఆరోగ్య ధృవీకరణ పత్రం (సీహెచ్‌సీ)
  • ప్రయాణ తేదీకి దగ్గరలో వైద్య ధ్రువీకరణ పత్రం జారీ చేయాలి.
  • అమర్‌నాథ్ యాత్ర 2026 రిజిస్ట్రేషన్ చివరి తేదీ
    అమర్‌నాథ్ యాత్ర 2026 రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీని ఇంకా అధికారికంగా నిర్ణయించలేదు. కానీ కోటా సీట్లు నిండిపోయే వరకు లేదా యాత్ర ముగియడానికి కొన్ని రోజుల ముందు వరకు ఇది సాధారణంగా తెరిచి ఉంటుంది.

  • యాత్ర ప్రారంభం: 2026 జూలై 3వ తేదీ
  • అంచనా ముగింపు: ఆగస్టు 2026 చివరిలో!
  • రోజువారీ కోటా నిండిన తర్వాత రిజిస్ట్రేషన్ మూసివేస్తారు. (పరిమిత-సీట్ల విధానం)
  • అధిక డిమాండ్ కారణంగా స్లాట్‌లు త్వరగా నిండిపోతాయి కాబట్టి, ముందుగానే నమోదు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.