
117views
సేవ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శబల భోజన పండగలకు ప్రజల నుంచి పెద్దఎత్తున ఆదరణ లభించడం ప్రకృతి వ్యవసాయంపై పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనమని రాష్ట్ర ఫుడ్ ప్రొసెసింగ్ విభాగం కార్యదర్శి చిరంజీవి చౌదరి అన్నారు. విశాఖ జిల్లా సింహాచలం దేవస్థానం గోశాల ఆవరణలో జరుగుతున్న శబల భోజన పండగల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ భోజన పండగలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయన్నారు. ప్రకృతి వనరుల పరిరక్షణ బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు.
శబల భోజనాల పండగలో అతిథులు





