News

అరసవల్లిలో వేద, పండిత సదస్సు

100views

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా వేద, పండిత సదస్సు నిర్వహించారు. అని వెట్టి మండపంలో స్వామి ఉత్సవ మూర్తు లను వేంచేపు చేసి ప్రధాన అర్చ కుడు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పండితులు భాస్కరభట్ల శ్రీరామ్మూర్తి, బంకుపల్లి రమేష్‌ శర్మ, సుసరాపు చంద్ర శేఖర్‌ శర్మ, ఆరవల్లి చంద్రశేఖర శర్మ, సాయి కుమార్‌ శర్మ తదితరులు స్వామిని కీర్తిస్తూ కవితా గానం చేశారు. అలాగే వేద పండితులు స్వామి సమక్షంలో మహదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా పండితులను ఎమ్మెల్యే గొండు శంకర్‌ సత్క రించి ఆశీస్సులు అందుకున్నారు. కార్యక్రమంలో అర్చకులు ఇప్పిలి ఫణీంద్ర శర్మ, రంజిత్‌ శర్మ, సందీప శర్మ, వేద పండితులు దర్భముళ్ల శ్రీనివాస శర్మ, రామకృష్ణ శర్మ, మోహనరావు, వికాస్‌ శర్మ, సాంబమూర్తి శర్మ, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయం వేదఘోషతో మార్మోగింది.