
96views
శ్రీకాకుళం నుంచి విశాఖ నగరంలోకి తొమ్మిది గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పీఎం పాలెం పోలీసులు అడ్డుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున కారు షెడ్డు కూడలి వద్ద తనిఖీలు చేపడుతుండగా ఈ వాహనం పట్టుబడింది. గోవులను ఎక్కడికి తరలిస్తున్నారన్న దానిపై డ్రైవర్ పొంతన లేని సమాధానం చెప్పడంతో.. పోలీసులు వాహనాన్ని, గోవులను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.





