News

ఏప్రిల్‌ 5న హనుమాన్‌ శోభాయాత్ర

66views

సమాజంలో హైందవ ధర్మ విశిష్టతను తెలియజేసేందుకు, హనుమంతుని వ్యక్తిత్వం, శౌర్యం, పరాక్రమం, వినయం వంటి లక్షణాలను పెంపొందించేందుకు గానూ నెల్లూరు  నగరంలో హనుమాన్‌ భక్త శోభాయాత్రను ఏప్రిల్‌ ఐదున నిర్వహించనున్నామని హిందూ చైతన్య వేదిక నేతలు వెల్లడించారు. శోభాయాత్ర బైక్‌ ర్యాలీకి సంబంధించిన సన్నాహక సమావేశాన్ని విజయమహల్‌ గేట్‌ సమీపంలోని ఓ హోటల్లో ఆదివారం నిర్వహించారు. వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరు జయరామ్‌, లీగల్‌ కన్వీనర్‌ మహేష్‌, ప్రచార విభాగాధ్యక్షుడు కాకు మురళీరెడ్డి, జిల్లా అధ్యక్షుడు తోటపల్లి సాయిశ్రీనివాస్‌, మోహన్‌ కిశోర్‌, స్వామి, మోహన్‌రావు, బాలాజీ, కోడూరు జయప్రద, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.