News

నంద్యాలలో అలరించిన బాలమేళా

179views

నంద్యాల జిల్లా, సంఘమిత్ర సేవా సమితి, సేవా బస్తీల్లో, పాఠశాల విద్యార్థుల కొరకు, పాఠశాల సమయం తరువాత నిర్వ హిస్తున్న అభ్యాసికల బాలమేల (వార్షికోత్సవం) స్థానిక ప్రథమ నంది కళ్యాణమండపంలో వైభవంగా జరిగింది.

సంఘమిత్ర సేవా సమితి ఎన్నో ఉదాత్తమైన సేవా కార్యక్రమాలతో పాటు, సేవా బస్తీల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులకు అభ్యాసికలు (ఉచిత ట్యూషన్ సెంటర్లు) ఏర్పాటు చేసి వారికి చదువుతో పాటు, తల్లి దండ్రులను, పెద్దలను, సమాజాన్ని, దేశాన్ని గౌరవించి, ప్రేమించే ఆదర్శవంతమైన సంస్కారాన్ని అందించి బస్తీ లలో ఉన్న విద్యార్థుల సర్వాంగీణ వ్యక్తిత్వ వికాసానికి కృషి చేస్తున్నది .వారు అక్కడ పొందిన సంస్కారాన్ని బాల మేళాలు ఏర్పాటు చేసి సమాజానికి పరిచయం చేయడం ఆనవాయితీ.

సదరు కార్యక్రమం గౌరవ అతిథుల జ్యోతి ప్రజ్వలన, అర్చన, మాలార్పణ, భగవాధ్వజ ఆవిష్కరణ తదుపరి సంఘమిత్ర ప్రారంభం నుండి చేపట్టిన అనేక సామాజిక సేవా కార్యక్రమాల ఛాయాచిత్ర ప్రదర్శన ప్రారంభోత్సవం జరిగింది. అతిథులను సగౌరవంగా సంఘమిత్ర విద్యార్థుల ఘోష్ ప్రదర్శనతో వేదిక వద్దకు ఆహ్వానించడం జరిగింది.

తదుపరి సంఘమిత్ర అధ్యక్షులు శ్రీ చిలుకూరి శ్రీనివాస్ అధ్యక్షతన, ముఖ్య అతిథి ప్రముఖ వ్యాపార వేత్త శ్రీ వంకదార శివప్రసాద్, లైఫ్ హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ లక్ష్మీ సౌజన్య, శ్రీ రామకృష్ణ విద్యాసంస్థల డీన్ శ్రీమతి గడ్డం ప్రగతి, ప్రముఖ వ్యవసాయ దారులు శ్రీ దేవన వెంకట రెడ్డి, ప్రధాన వక్త, క్షేత్ర సేవా ప్రముఖ్ మాన్య శ్రీ ఎక్కా చంద్ర శేఖర్ తదితరులు వేదికపై ఆసీనులయ్యారు.

చిన్నారుల ప్రదర్శనలు సనాతన సంస్కృతీ సంప్రదాయాలను, ఆధ్యాత్మిక సంపదను, పర్యావరణ పరిరక్షణ, దేశానికి పట్టుకొమ్మలైన గ్రామీణ కళలైన, కోలాటం, యోగచాప్ లాంటి కళలను, శాస్త్రీయ నృత్యాల సభికులను ఆద్యంతం ఆకట్టుకున్నాయి

ఈ సందర్భంగా ప్రధాన వక్త మాట్లాడుతూ, ప్రభుత్వం కోట్ల బడ్జెట్ తో సంపూర్ణంగా చేయలేని ఎన్నో సామాజికోద్దరణ కార్యక్రమాలను, సామాజిక భాగస్వామ్యంతో ఎన్నో రెట్లు విలువైన సామాజిక ఉద్ధరణ కార్యక్రమాలు చేయవచ్చని సేవా భారతి (సంఘమిత్ర) నిరూపించిందని తెలియజేశారు. సంఘమిత్ర సాధించిన స్ఫూర్తిదాయకమైన విజయ గాథలను వివరించారు.

సదరు కార్యక్రమంలో సంఘ్ జ్యేష్ట కార్యకర్తలు, సంఘమిత్ర కార్యవర్గ సభ్యులు, హితైసులు, అభ్యాసికల విద్యార్థులు, వారి తల్లి దండ్రులు, ఆయా గ్రామాల పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం విజయం కోసం శ్రమించిన అభ్యాసికల ఉపాధ్యాయులను డాక్టర్ లక్ష్మీ సౌజన్య సత్కరించారు.