
115views
గుంటూరు జిల్లాలోని వట్టిచెరుకూరు మండలంలోని కొర్నెపాడు రైతు నేస్తం ఫౌండేషన్ దశాబ్ది వార్షికోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవంలో భాగంగా మిద్దె తోటల పెంపకం రైతులకు అవార్డులు ప్రదానం చేశారు. తొలుత కేంద్రమంత్రి పెమ్మసానిచంద్రశేఖర్‌కు రైతు నేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు.. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయం పంట ఉత్పత్తులు, స్టాళ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంతో పండించే ఆకుకూరలు, కూరగాయలతో ఆరోగ్యంగా ఉంటామన్నారు. ఈ పంటలను అందరూ ఆదర్శంగా తీసుకుని సాగు చేయాలని ఆయన సూచించారు.





