
నాగాలాండ్ బాప్టిస్ట్ చర్చ్ కౌన్సిల్ -NBCC రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ – ఆర్ఎస్ఎస్ మరియు విశ్వ హిందూ పరిషత్ వి హెచ్ పి పై చేసిన ఆరోపణలను విశ్వ హిందూ పరిషత్ అఖిల భారతీయ అధ్యక్షులు అలోక్ కుమార్ ఖండించారు. ఆ సంస్థ భారతీయ సమాజంలోని వివిధ వర్గాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నంగా కనిపిస్తోందని తెలిపారు.
నాగాలాండ్‌లోని సమ్జియురామ్ బాప్టిస్ట్ చర్చ్‌పై అస్సాం రైఫిల్స్ దాడి జరిగినట్లు ఆ సందర్భానికి సంబంధం లేకపోయినా, ఆర్ఎస్ఎస్ మరియు వి హెచ్ పి సంస్థలను “హింసను ప్రోత్సహించే, అలాంటి చర్యలను సమర్థించే సంస్థలు”గా ఆరోపణనలు చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఆశ్చర్యకరంగా, ఆ ఘటనకి ఆర్ఎస్ఎస్ మరియు వి హెచ్ పి కి సంబంధం ఉందో, లేదా వారు ఆ ఘటనను సమర్థించారో అన్న విషయాన్ని ఆ సంస్థ ప్రకటనలో పేర్కొనలేదు అని ఆయన తెలిపారు.
ఆర్ఎస్ఎస్ మరియు వి హెచ్ పి దేశభక్తి గల మరియు చట్టాన్ని పాటించే సంస్థలని అందరికీ తెలిసిందేనని అన్నారు. ఇవి ప్రధానంగా సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా, ముఖ్యంగా ఆదివాసీలు మరియు ఇతర వర్గాల కోసం హిందూ సమాజాన్ని ఐక్యం చేయడానికి పనిచేస్తున్నాయని అన్నారు.
స్థానికంగా అందిన సమాచారం ప్రకారం, ఆ ఆపరేషన్ సమయంలో ‘అస్సాం రైఫిల్స్’ వల్ల ఎలాంటి హింస లేదా నష్టం జరగలేదని స్థానిక పాస్టర్ మరియు గ్రామ అధికారులు అధికారికంగా ధృవీకరించారు అని ఆయన తెలిపారు.
ఎన్‌బీసీసీ చేసిన ప్రకటన సాధారణ భద్రతా చర్యను మతపరమైన మరియు సిద్ధాంతపరమైన వివాదంగా మార్చే దురుద్దేశపూరిత అవాస్తవ ప్రయత్నంగా కనిపిస్తోందని అన్నారు.
ఆర్ఎస్ఎస్ మరియు వి హెచ్ పి సంస్థలకు ఘటనకు సంబంధం లేకుండానే, రాజకీయ లేదా మతపరమైన దృష్టితో చేసిన చర్యగా కనిపిస్తున్నాయని తెలిపారు.
భారతీయ సమాజంలోని వర్గాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నంగా ఎన్‌బీసీసీ చేసిన ఈ ఆరోపణలను విశ్వ హిందూ పరిషత్ ఖండిస్తోందని పేర్కొన్నారు.





