
కేరళలో వివాదం రేగింది. జమాతే ఇ ఇస్లామి నిర్వహిస్తున్న కొన్ని పాఠశాలలు, మదర్సాల పాఠ్యాంశాల్లో కొత్తగా సిలబస్ జోడించడంపై తీవ్ర వివాదం రేగుతోంది. ఆ సిలబస్ లో ప్రపంచ వ్యాప్తంగా నిషేధించబడిన ‘‘ముస్లిం బ్రదర్ హుడ్ సంస్థతో సంబంధం వున్న వ్యక్తుల ప్రొఫైల్ లు, ఫొటోలు ప్రత్యక్షమయ్యాయి.అంతేకాకుండా ఉగ్రవాద సంస్థ హమాస్ ను కీర్తించే కంటెంట్ కూడా వుంది.
అంతేకాకుండా హమాస్ వ్యవస్ధాపకుడు షేక్ అహ్మద్ యాసిన్ ను కీర్తిస్తూ కూడా ఇందులో కంటెంట్ వుంది. దీంతో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అస్సలు వివాదం ఎక్కడంటే.. ఏడో తరగతి విద్యార్థుల పాఠ్య పుస్తకంలో పునరుజ్జీవన నాయకులు అన్న దానిపైనే నడుస్తోంది. ఈ అధ్యాయం ముస్లిం బ్రదర్‌హుడ్‌తో ముడిపడి ఉన్న నాయకులను విద్యార్థులకు పరిచయం చేస్తుందని, సంస్థ వ్యవస్థాపకుడు హసన్ అల్-బన్నా మరియు అతని వారసుడు సయ్యద్ కుతుబ్‌లను పునరుజ్జీవనోద్యమ వ్యక్తులుగా చిత్రీకరిస్తుందని, జమాత్-ఇ-ఇస్లామి వ్యవస్థాపకుడు సయ్యద్ అబుల్ అలా మౌదుది గురించి వివరణాత్మక సూచనలను కూడా అందిస్తుందని తెలుస్తోంది. అలాగే హమాస్ వ్యవస్ధాపకుడు షేక్ అహ్మద్ యాసిన్ ను కూడా పునరుజ్జీవనోద్యమ నాయకుడిగానే ప్రశంసిస్తూ వుంది.
కేరళ పోలీసుల నియమం ప్రకారం 163 సెక్షన్ కింద గతంలో నిషేధించిన ‘‘వజియదయలం’’ అనే పుస్తకాన్ని కూడా ఈ మదర్సాలు, పాఠశాలల సిలబస్ లో చేర్చారు. ఈ వివాదం ముదిరేందుకు మరింత కారణం అవుతోంది. అప్పుడే దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో పుస్తక అనువాదకుడు అబ్దుల్ రెహ్మాన్ ను అరెస్ట్ చేశారు. గతంలో అతను సిమి ఎర్నాకులం అధ్యక్షునిగా కూడా పనిచేశాడు.
ఇక… ఈ సంస్థలను కోజికోడ్ లో వున్న మజ్లిస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వున్న జమాత్ ఇ ఇస్లామి నిర్వహిస్తున్న అనేక పాఠశాలలను, మదర్సాలను ఇది పర్యవేక్షిస్తోంది.ఈ సంస్థల సిలబస్‌లను జమాతే ఇ ఇస్లామీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తయారు చేస్తుంది





