News

కర్నాటకలోని ముధోల్ లో లవ్ జిహాద్ కేసు

102views

కర్నాటకలోని ముధోల్ లో తాజాగా లవ్ జిహాద్ కేసు బయటపడింది. మొదట మత మార్పిడి చేశారని, ఆ తర్వాత వివాహం చేసుకొని, చివరి దశలో మోసం చేశాడని, వేధింపులు కూడా తీవ్రమయ్యాయంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కురబ అనే వర్గానికి చెందిన శ్రీదేవి అనే మహిళ ఈ లవ్ జిహాద్ ని బయటపెట్టింది. తనను ఇస్లాంలోకి మార్చి, వివాహం తర్వాత తన డబ్బును, బంగారం నగలను తీసుకొని, ఇప్పుడు ఇంటి నుంచి తరిమేశారంటూ గోడును వెళ్లబోసుకుంది.

నిజానికి 14 సంవత్సరాల క్రితం శ్రీదేవికి వివాహమై, పిల్లలున్నారు. అయితే ముధోల్ కేంద్రంగా పనిచేస్తున్న సందర్భంలో సవీఫ్ పట్టే అనే వ్యక్తితో పరిచయమైంది. స్నేహం తర్వాత, ప్రేమ అంటూ వెంటబడ్డాడని తెలిపింది. ఇప్పటికే సవీఫ్ కి ఇద్దరు భార్యలున్నారని కూడా పోలీసుల దృష్టికి తీసుకొచ్చింది. తనను వివాహం చేసుకొని, మంచి స్థిరమైన జీవితం ఇస్తానని మోసం చేశారని వాపోయింది.

తనను బలవంతంగా మతం మార్చేసిన తర్వాత తన పేరును హబీబాగా మార్చేశారని పేర్కొంది. నిఖా సంప్రదాయంలో తమ వివాహం జరిగిందని కూడా చెప్పుకొచ్చింది. ఎలాగైతే వివాహమైందో అప్పటి నుంచి వ్యక్తి పూర్తిగా మారిపోయాడని, వేధించడం, బెదిరించడం ప్రారంభమైందని, 4 లక్షల నగదు, నాలుగు తులాల బంగారాన్ని లాగేసుకొని, ఇప్పుడు వెళ్లగొట్టాడని వెల్లడించింది .అయితే మహిళ ఫిర్యాదు అందిందని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.

ఇప్పటికే చాలా చోట్ల లవ్ జిహాద్ పేరుతో ముస్లిం ఛాందసులు హిందూ అమ్మాయిలను వేధిస్తూనే వున్నారు. అనేక జాతీయవాద సంస్థలు దీనిపై ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యపరుస్తూనే వున్నాయి. కొన్ని చోట్ల కాస్త అదుపులో వున్నాయి. మరికొన్ని చోట్ల కేసులు కూడా పెరుగుతున్నాయి. నిజానికి కుటుంబ వ్యవస్థ, తల్లిదండ్రుల క్రియాశీల పాత్ర సరిగ్గా వుంటే ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయవచ్చు. ముస్లిం ఛాందసుల విషయంలో హిందూ అమ్మాయిలు, హిందూ మహిళలు నిరంతరం అప్రమత్తంగా వుండాల్సిందే.