News

దైవభక్తి చాటుతూ.. 15వేల కిలోమీటర్ల సైకిల్‌ యాత్ర

100views

దైవభక్తి చాటుతూ మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా 15 వేల కిలోమీటర్లు సైకిల్‌ యాత్ర చేపట్టాడు. అహ్మద్‌నగర్‌కు చెందిన సంజయ్‌కారత్‌ దేశంలోని 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని 2024 నవంబరు 1న సైకిల్‌పై బయలుదేరాడు. గుజరాత్‌, నేపాల్‌, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, జార్ఖండ్‌, ఒడిశా, రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని 11 జ్యోతిర్లింగాలను దర్శించుకున్నాడు.

చివరగా తమిళనాడు రాష్ట్రం రామేశ్వరంలోని జ్యోతిర్లింగాల్ని దర్శించుకోవడానికి బయలుదేరాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ములకలచెరువు మీదుగా వెళ్లాడు. ఇప్పటి వరకు 14వేలకుపైగా కిలోమీటర్లు పూర్తి చేసుకున్నానని, తిరుపతికి వెళ్లి అక్కడి నుంచి తమిళనాడుకు వెళ్తానని సంజయ్‌ తెలిపారు. 500 రోజుల యాత్ర పూర్తయిందని, మరో 10 రోజుల్లో ముగుస్తుందని వివరించాడు.