News

మహారాష్ట్రలో మతమార్పిడి నిరోధక చట్టం!

119views

మహారాష్ట్రలో మతమార్పిడి నిరోధక చట్టం ముసాయిదాకుగురువారం ఆ రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదిత చట్టం ప్రకారం, ఇకపై ఎవరైనా ఒక మతం నుంచి మరో మతంలోకి మారాలనుకుంటే కనీసం 60రోజుల ముందే సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి. అలాగే, మత మార్పిడి జరిగిన 25రోజుల్లోపు దానిని అధికారికంగా నమోదు చేయాలని, లేనిపక్షంలో ఆ మార్పిడి చెల్లదని అధికారులు స్పష్టం చేశారు. బలవంతపు మత మార్పిడులు, మోసపూరిత వాగ్దానాలు లేదా ఆశచూపి చేసే మార్పిడుల నుంచి పౌరులకు రక్షణ కల్పించడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. ఒక వ్యక్తి అక్రమంగా మతం మారుతున్నట్లు సదరు వ్యక్తి బంధువులు ఫిర్యాదు చేస్తే, పోలీసులు వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ చేపడతారు. ‘ధర్మ స్వాతంత్య్ర అధినియం 2026’ పేరుతో ఈ బిల్లును రూపొందించారు. త్వరలోనే చట్టం చేయనున్నారు.