News

బంగ్లాదేశ్‌ ఆలయాల్లో పేలుళ్లు

105views

బంగ్లాదేశ్‌లోని ఆలయాల్లో గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన బాంబు దాడిలో ఓ పూజారి సహా పలువురు గాయపడ్డారు. కోమిల్లా ప్రాంతంలోని కాలిగాచ్‌ తాలా కాళి మందిర్‌లో శనివారం సాయంత్రం పూజలు నిర్వహిస్తున్న సమయంలో ఈ బాంబు పేలుడు జరిగింది. మాస్క్‌ ధరించిన ఓ వ్యక్తి బ్యాగుతో సహా ఆలయంలోకి ప్రవేశించినట్లు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. కొద్దిసేపటికి అతడు బ్యాగును అక్కడే వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు. ఆ తర్వాత జరిగిన పేలుడులో పూజారి కేశోబ్‌ చక్రబోర్తి(48) గాయపడ్డారు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న ప్రజలంతా భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. వెళ్తూ వెళ్తూ దేవాలయం సమీపంలోని ఓ బౌద్ధ మందిరం, ప్రైవేటు కార్యాలయంపైనా దుండగుడు బాంబులు విసిరారని పోలీసులు తెలిపారు. ఈ దాడుల్లో అబ్దుల్‌ బరేక్, అతడి కుమారుడు సుజత్‌ అలీ గాయపడ్డారు.