
దేవభూమి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నిర్వహించే ప్రపంచ ప్రఖ్యాత చార్‌ధామ్ యాత్ర 2026 కోసం ప్రభుత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. దేశం నలుమూలలతో పాటు విదేశాల నుంచి వచ్చే భక్తుల మార్చి 06 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. బాబా కేదార్ లేదా బద్రీ విశాల్ దర్శనానికి వెళ్లాలని భావిస్తున్న భక్తులకు ఈ సమాచారం ఎంతో ముఖ్యమైనది. ఈ సంవత్సరం చార్ ధామ్ యాత్ర ఏప్రిల్ మూడవ వారంలో ప్రారంభం కానుంది. ఈ యాత్ర గురించిన మరిన్ని ముఖ్యమైన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పవిత యాత్రకు వెళ్లాలనుకునేవారు ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి.
ఎలా నమోదు చేసుకోవాలి?
భక్తులు క్రింది మార్గాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు:
రిజిస్ట్రేషన్ దశలు
సందర్శకుల పరిమితిపై వివాదం
ఈసారి యాత్రకు వచ్చే భక్తుల సంఖ్యను పరిమితం చేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చార్‌ధామ్ హోటల్ అసోసియేషన్ ఈ నిర్ణయం స్థానిక వ్యాపారాలకు నష్టం కలిగిస్తుందని పేర్కొంది. ప్రభుత్వం నిర్ణయాన్ని పునఃపరిశీలించకపోతే మార్చి రెండో భాగంలో నిరసనలు ప్రారంభిస్తామని అసోసియేషన్ అధ్యక్షుడు రాజేష్ మెహతా హెచ్చరించారు. అయితే హిమాలయ ప్రాంతంలో భద్రతను దృష్టిలో పెట్టుకుని భక్తుల రద్దీని నియంత్రించడం అవసరమని ప్రభుత్వం చెబుతోంది.





