
నంద్యాల జిల్లా, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో, స్థానిక సంజీవ నగర్ గేటు సమీపంలో గల శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల ప్రాంగణం, స్వామి వివేకానంద ఆడిటోరియంలో ఛత్రపతి శివాజీ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. సదరు కార్యక్రమంలో ప్రధాన వక్తగా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విభాగ్ సహా సంపర్క ప్రముఖులు శ్రీ రామకృష్ణ మాట్లాడుతూ, ఛత్రపతి శివాజీ గారి జీవితాన్ని మనమందరం ఆదర్శంగా తీసుకొని, ఇలాంటి మహనీయుల అడుగుజాడల్లోనే నడవాలని చెబుతూ, ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత ఘట్టాలను విద్యార్థులకు , కళ్ళకు కట్టినట్లుగా వివరించారు. విశ్వ గురు స్థానం వైపు భారత్ ప్రస్థానాన్ని చూచి ఓర్వలేక రకరకాల కుట్రలు పన్నుతున్న విదేశీ పాషండ శక్తుల నుండి మన భరత మాతను కాపాడు కొనుటకు ప్రతి భారతీయుడు ఒక శివాజీ లా ఉద్యమించాలని వక్తలు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో శ్రీరామకృష్ణ విద్యా సంస్థల అధినేత శ్రీ జి. రామకృష్ణారెడ్డి, కళాశాల యాజమాన్యం, ఏబీవీపీ భాగ్ కన్వీనర్ శ్రీ లక్ష్మీ నరసింహ, నగర సహకార్యదర్శి శ్రీ మనేష్, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

నంద్యాల్లోని అరుంధతి నగర్ లో శివాజీ జయంతి ఘనంగా జరిగినది ఈ కార్యక్రమంలో E. రాంప్రసాద్. జింక నరేంద్ర. చింతల పల్లె వాసు పాల్గొన్నారు. రాంప్రసాద్ మాట్లాడుతూ శివాజీ జీవితంలోని సంఘటనలు తెలిపారు ఈ కార్యక్రమంలో దాదాపు 50 మంది యువకులు పాల్గొన్నారు





