News

ఆలయాల్లో కొత్త టెక్నాలజీ

148views

మనుషులు చేసే పనులను కూడా మెషీన్లు చేసేస్తుండటంతో ఇంటి పనులకే కాదు.. ఆఫీస్ పనులకు కూడా మనిషి అవసరం లేని పరిస్థితి వచ్చింది. ఏఐ పుణ్యమా అని ఇప్పటికే అనేక సంస్థలు భారీగా లే ఆఫ్ లు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇంట్లో బట్టలు ఉతికేందుకు వాషింగ్ మెషీన్, గిన్నెలు కడిగేందుకు డిష్ వాషర్, ఇల్లు క్లీన్ చేసేందుకు క్లీనింగ్ మెషీన్లు ఉన్నట్లే.. గుడిలో కూడా తీర్థం మెషీన్ వచ్చేసింది. టెక్నాలజీ పుణ్యమా అని దేవాలయాల్లోనూ వినూత్న మార్పులొస్తున్నాయి. తీర్థం మెషీన్ తో అర్చకులకూ పనిభారం తగ్గిందని కామెంట్స్ చేస్తున్నారు. భక్తులు చేతిని సెన్సార్ వద్ద ఉంచగానే తగు పరిమాణంలో తీర్థం చేతిలో పడుతుంది. దీన్ని డిజిటల్ తీర్థం మెషీన్ గా పిలుస్తున్నారు.

కర్ణాటకలోని నిట్టేలో నిట్టే విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని మహాగణపతి ఆలయంలో కాంటాక్ట్‌లెస్ తీర్థం డిస్పెన్సర్‌ ను ఏర్పాటు చేశారు. అయితే దీనిని 2020లో COVID భద్రత కోసం స్థానిక ప్రొఫెసర్ అభివృద్ధి చేశారు. వీడియోను గమనిస్తే భక్తులంతా మాస్కులు పెట్టుకుని ఉన్నారు. అప్పట్లో వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు డైరెక్ట్ కమ్యూనికేషన్ లేకుండా తీర్థం పంపిణీకి ఇలా మెషీన్ ను ఉపయోగించారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ వీడియో వైరల్ అవ్వగా.. నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు.