
మున్ముందు ప్రముఖ పుణ్యక్షేత్రా ల్లో ఒకటిగా పంచథామ క్షేత్రం పేరొందుతుందని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా చిన్న హరిశ్చంద్రపురంలో వెలసిన పంచథామ క్షేత్రాన్ని ఆయన సందర్శించి.. స్పటిక, వాయి, జల లింగంతోపాటు రామసేతువులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్షేత్రంలో సాక్షాత్తు శివుడే ఉన్నారన్నట్టుగా ఎక్కడా చూసిన శివలింగాలు, దేవతాముర్థుల విగ్రహాలు కనిపిస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.
ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపిస్తా..
టెక్కలి, కోటబొమ్మాళి, నరసన్నపేట, జలుమూరు, సారవకోట మండలాల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉన్న హరిశ్చంద్రపురం రైలు నిలయంలో ఎక్స్ ప్రెస్ రైళ్లు అపిస్తానని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. హరిశ్చంద్రపురంలోని గ్రామస్థులతో మాట్లాడుతూ.. ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపేందుకు చర్యలు తీసుకోవాలని, దీనికోసం ఇప్పటికే కేంద్ర రైల్వేమంత్రితో మాట్లాడానని, ఆ యన కూడా సానుకూలంగా ఉన్నారన్నారు.





